చలన చిత్ర అవార్డుల ప్రకటన
బుల్లి తెరకు కూడా..
ఈనెల 13న ప్రదానం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
2016–2022 కాలానికి ఎంపికై న వారి జాబితా విడుదల
సాక్షి,చైన్నె: తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, బుల్లి తెర అవార్డులను తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డులను గురవారం రాత్రి సీఎం స్టాలిన్ ప్రకటించారు. 2016 నుంచి 2022 సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 2014 నుంచి 2022 సంవత్సరాలకు స్మాల్ స్క్రీన్ అవార్డులు, 2015 – 2016 నుంచి 2021 – 2022 విద్యా సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డులు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తేదీన చైన్నెలోని కలైవానర్ అరంగం వేదికగా అందజేయనున్నారు.
విజేతల వివరాలు ఇలా..
2016 నుంచి 2022 వరకు ఆయా సంవత్సరాల వారీగా విడుదల చేసిన జాబితాలో వరుసగా ఉత్తమ నటులుగా విజయ్ సేతుపతి, కార్తీ, ధనుష్, ఆర్.పార్తిబన్, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు, ఉత్తమ నటీమణులుగా కీర్తి సురేష్, నయనతార, జ్యోతిక, మంజు వారియర్, అపర్ణబాల మురళి, లిజో మోల్జోస్, సాయి పల్లవి ఉన్నారు. ఉత్తమ దర్శకులుగా లోకేష్ కనకరాజ్, పుష్కర్ గాయత్రి, మారిసెల్వరాజ్, ఆర్.పార్తీబన్, సుధా కొంగర, జ్ఞానవేల్, గౌతమ్ రామచంద్రన్ ఎంపికయ్యారు. ఉతమ చిత్రాలుగా నగరం, ఛారిటీ, పరియేరుమ్ పెరుమాళ్, రాక్షసన్, జై భీమ్, కార్గీ తదితర సినిమాలు జాబితాలో ఉన్నాయి. ఇక బుల్లితెరలో ఉత్తమ నటులుగా ఎం.రాజ్‌కుమార్, ఆర్.పాండియరాజన్, కౌశిక్, కృష్ణ , తలైవాసల్ విజయ్, వి.సంజీవ్, జయకాష్, కార్తీక్‌రాజ్, సంజీవ్, ఉత్తమ నటీమణులుగా ఆర్.రాధికా శరత్‌కుమార్, వాణీభోజన్, నీలిమరాణి, సంఘ వి, రేవతి, రేష్మ, షబానాషా జహాన్ కేబరాల్లయిత్రా జహాన్ ఉన్నారు.
బహుమతులు ఇలా..
తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలకు మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. లక్ష, మూడవ బహుమతి రూ. 75 వేలు అందజేయనున్నారు. ప్రత్యేక బహుమతి రూ. 75 వేలు, మహిళలను సానుకూల దృక్పథంలో చిత్రీకరించిన చిత్రానికి రూ. 1.25 లక్షల ప్రత్యేక బహుమతిని అందించనున్నారు. ఉత్తమ నటుడు,నటి , ఉత్తమ సాంకేతిక కళాకారులకు వరుసగా పది గ్రాముల బంగారు పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసిన ఉత్తమ బుల్లి తెర సీరియల్స్‌కు మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. లక్ష ఉత్తమ హీరో, హీరోయిన్, ఉత్తమ సాంకేతిక కళాకారుడికి వరుసగా రూ. లక్ష, సంవత్సరపు ఉత్తమ సాధకుడికి రూ. లక్ష, జీవితకాల సాధకుడిగా రూ. లక్ష నగదు, బంగారు పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ అందజేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ శిక్షణ సంస్థ విద్యార్థి అవార్డుకు ఎంపికై న విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయనున్నారు.
చలన చిత్ర అవార్డుల ప్రకటన
చలన చిత్ర అవార్డుల ప్రకటన
చలన చిత్ర అవార్డుల ప్రకటన
చలన చిత్ర అవార్డుల ప్రకటన
చలన చిత్ర అవార్డుల ప్రకటన


