కొనసాగుతున్న రగడ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రగడ

Jan 29 2026 6:35 AM | Updated on Jan 29 2026 6:35 AM

కొనసాగుతున్న రగడ

కొనసాగుతున్న రగడ

● జననాయగన్‌ విడుదలపై సందిగ్ధం

తమిళసినిమా: జననాయకన్‌ చిత్రం ఇప్పుడు మరింత వివాదాంఽశంగా మారుతోంది. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జన నాయకన్‌. హెచ్‌.వినోద్‌ దర్శకత్వలో కేవీఎన్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని నెల 9వ తేధీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సెన్సార్‌ సమస్యలు తలెత్తడంతో సెన్సార్‌బోర్డు, కోర్టుల్లో ఈ చిత్రం నానుతోంది. చిత్రంలో పలు వివాదాస్పద సన్నివేశాలు చోటు చేసుకోవడంతో చిత్రాన్ని రివైజింగ్‌ కమిటీకి పంపినట్లు సెన్సార్‌బోర్డు అఽధికారులు పేర్కొన్నారు. దీంతో చిత్ర నిర్మాత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి ఆషా జననాయకన్‌ చిత్రానికి వెంటనే సర్టిఫికేట్‌ అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను వ్యతికేకిస్తూ సెన్సార్‌బోర్డు అధికారులు మద్రాసు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసును విచారించడంలో తమకు ఆసక్తిలేదని, మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి పరిస్థితులో మద్రాసు హైకోర్టు మంగళవారం జననాయకన్‌ చిత్ర వ్యవహారంలో ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేసింది. జననాయకన్‌ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లు చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని, అదేవిధంగా సెన్సార్‌ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్‌ సర్టిఫికెట్‌ను కోరడం సముచితం కాదని, సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీకి పంపగా ఆ కమిటీ విచారణ చేసేందుకు గడువు ఇవ్వకుండా సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి ఆదేశించడాని రద్దు చేస్తున్నట్లు మద్రాసు హెకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేశారు.

సెన్సార్‌ బోర్డే అవసరం లేదు

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ సెన్సార్‌ బోర్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన మంగళవారం చైన్నెలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ నటించిన జననాయకన్‌ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సెన్సార్‌ బోర్డు వివక్షత ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళా స్టోరీ వంటి వివాదాస్పద చిత్రాలకు సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌బోర్డు జననాయకన్‌ చిత్రానికి ఇవ్వడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నంచారు. సెన్సార్‌ బోర్డే అవసరం లేదని అన్నారు. సెన్సార్‌ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో కాకుండా,సినిమాకు చెందిన మధ్యవర్తులతో కూడిన కమిటీగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement