నాణ్యమైన విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందించాలి

Jan 29 2026 6:35 AM | Updated on Jan 29 2026 6:35 AM

నాణ్య

నాణ్యమైన విద్య అందించాలి

నాణ్యమైన విద్య అందించాలి క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

కొరుక్కుపేట: నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని శ్రీ కనకదుర్గ తెలుగు (ఎస్‌కేడీటీ)పాఠశాలల అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ మేరకు చైన్నె విల్లివాక్కం లోని శ్రీ కనక దుర్గ ప్రాథమిక పాఠశాల 2026– 27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్‌ సీఎంకే రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 2026– 27 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన అడ్మిషన్ల బ్రోచర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా తెలుగు విద్యార్థుల కోసం ఈ పాఠశాల ఎక్కువగా కృషిచేస్తుందని వారి విద్యాభివద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌ రేణుక, కరస్పాండెంట్‌ డాక్టర్‌ నాగభూషణం పాల్గొన్నారు.

వ్యాన్‌ నుంచి పడి

బాలిక దుర్మరణం

అన్నానగర్‌: స్కూల్‌ వ్యాన్‌ నుంచి పడి ఓ బాలిక దుర్మరణం పాలైంది. సేలం జిల్లాలోని తారమంగళం సమీపంలోని పప్పంపాడు గ్రామానికి చెందిన కుమార్‌ (38), భార్య అరుణ. వీరికి ఇద్దరు కుమార్తెలు హన్సిక (4), యాషిక (2). హన్సిక ఎల్‌కేజీ చదువుతోంది. బుధవారం అరుణ హన్సికను స్కూల్‌ వ్యాన్‌న్‌లో తీసుకెళ్తుండగా. చిన్నారి యాషిక స్కూల్‌ వ్యాన్‌ నుంచి అకస్మాతుగా కిందకు పడింది. వ్యాన్‌ వెనుక చక్రం యాషిక పైకి దూసుకెళ్లడంతో బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దక్షిణాసియాకు చెందిన ర్యుక్యు కోబుడో అండ్‌ షోరిర్యు కరాటే స్టైల్‌ చీఫ్‌ , టెక్నికల్‌ డైరెక్టర్‌ రెన్షి డాక్టర్‌ కోబుడో ఏఎస్‌.కృష్ణమూర్తి అన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల 27వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని బుధవారం జరుపుకున్నారు. కార్యక్రమానికి రెన్షి డాక్టర్‌ కొబుడో, ఎ.ఎస్‌.కృష్ణమూర్తి హాజరై జ్యోతి వెలిగించి క్రీడా దినోత్సవాన్ని ఆరంభించారు. కళాశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించారు. ఇంటర్‌–కాలేజియేట్‌, ఇంటర్‌–జోన్‌, జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలలో ప్రశంసలు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా క్రీడా విద్యార్థులు ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కరస్పాండెంట్‌ చిన్ని బాలాజీ, ప్రిన్సిపల్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ పి. బి. వనిత, వైస్‌ ప్రిన్సిపల్‌ పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి 
1
1/1

నాణ్యమైన విద్య అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement