చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

Jan 29 2026 6:35 AM | Updated on Jan 29 2026 6:35 AM

చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

అన్నానగర్‌: చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో జరిగిన అగ్నిప్రమాదం భయాందోళనలకు గురిచేసింది. పొగ కారణంగా ఇద్దరు ఉద్యోగులు స్పృహ కోల్పోయారు. వివరాలు.. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్‌ 2 నిష్క్రమణ ప్రాంతం ప్రవేశ ద్వారం వద్ద విమానయాన సంస్థల కార్యాలయాలద్దున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్‌న్స్‌ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అంతర్జాతీయ నిష్క్రమణ టెర్మినల్‌ మొత్తాన్ని దట్టమైన పొగ కప్పేసింది. ఫలితంగా చైన్నె విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయంలో పొగలో చిక్కుకున్న ప్రయాణికులను, విమానాశ్రయ సిబ్బందిని అత్యవసరంగా టెర్మినల్‌ నుండి తరలించారు. వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని అత్యవసరంగా పిలిపించి, అత్యవసర అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. దీని తరువాత, చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్‌, కొలంబో, ఢాకాతో సహా 8 విమానాలలో ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌ల జారీ తాత్కాలికంగా నిలిపివేశారు. చైన్నె విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది వెంటనే 3 వాహనాల్లో వచ్చి దాదాపు గంటసేపు పోరాడి మంటలను ఆర్పి, పొగను తొలగించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.దాదాపు గంట తర్వాత, ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లు జారీ చేయబడి, విమాన సేవలు తిరిగి ప్రారంభించబడ్డాయి. సింగపూర్‌ ఎయిర్‌ లైనన్స్‌ కార్యాలయంలో మంటలు చెలరేగి వివిధ ఫైళ్లు, పత్రాలు దగ్ధమయ్యాయి. పొగ పీల్చడం వల్ల స్పృహ కోల్పోయిన ఇద్దరు ఉద్యోగులకు ప్రథమ చికిత్స అందించినట్లు తెలుస్తోంది. చైన్నె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం విద్యుత్‌ లోపం వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణమా అనే దాని పై విమానాశ్రయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement