తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి డీఎంకే కూటమిలో కాంగ్ర
టీఎన్‌సీసీ నేతల వ్యాఖ్యలపై రగడ
కాంగ్రెస్‌కు ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆహ్వానం
ఆసక్తికరంగా డీఎంకే కూటమి
రాజకీయం
సాక్షి, చైన్నె: ఆది నుంచి తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్‌ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. 2011లో కాంగ్రెస్‌కు 60కు పైగా సీట్లను డీఎంకే ఇవ్వగా, కేవలం ఐదుగురే గెలిచారు. 2016 ఎన్నికలలో 41 సీట్ల కేటాయించగా 8 మంది నెగ్గారు. 2021 ఎన్నికలలో కాంగ్రెస్ సీట్లకు డీఎంకే బాగానే కోత పెట్టింది. 25 స్థానాలు అప్పగించగా, 18 చోట్ల గెలిచారు. ఆ తదుపరి తమిళనాట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, నగరపాలక సంస్థల ఎ న్నికలలో డీఎంకే కూటమితో కలిసి ఎదుర్కొన్నప్పటికీ కాంగ్రెస్‌కు ఆశించిన మేరకు కార్పొరేషన్లు, నగర పాలక సంస్థలలో పదవులు దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలలో తొమ్మిది స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్ అన్నింటా గెలిచింది. తమిళనాడులో 39 స్థానాలను డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇదంతా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పాలన ఘనతే అన్న చర్చ జోరుగా జరిగింది.
సీట్ల పందేరం..
ఈ చర్చలు, వివాదాస్పద వ్యాఖ్యలు సాగుతున్న తరుణంలో విజయ్ తండ్రి , దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ బుధవారం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ చరిత్ర కలిగిన పార్టీ అని, ఆ పార్టీకి ఉన్న బలం ఏమిటో ఇప్పుడున్న నేతలకు తెలియడం లేదని, వారికి బూస్ట్ ఇవ్వడానికి విజయ్ రెడీ అని వ్యాఖ్యలు చేశారు. విజయ్‌తో కలిసి వెళ్తే కాంగ్రెస్‌కు అధికారంలో వాటా తథ్యం అని, తద్వారా మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయవచ్చని సూచించారు. ఈ వ్యాఖ్యలపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుతొంగై స్పందిస్తూ, తమకు ఇప్పటికే రాహుల్ బూస్ట్, హార్లిక్స్‌చ్చారని, కొత్తగా ఎవ్వరూ ఇవ్వాల్సిన అవశ్యం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఈ పరిణామాల నేపథ్యంలో హఠాత్తుగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి కనిమొళి మధ్యాహ్నం వెళ్లారు. ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో గంట పాటూ ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీలో కూటమిపై చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీట్ల పందేరం కొలిక్కి తెచ్చే విధంగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఆ మేరకు తమకు 38 అసెంబ్లీ స్థానాలు, రెండు రాజ్యసభ సీట్లు ఇవ్వాలన్న తుది నిర్ణయాన్ని డీఎంకే ముందు రాహుల్ ఉంచినట్టు తెలిసింది. అయితే 25 స్థానాలు ప్రస్తుతానికి ఒకటి, ఆ తదుపరి మరో రాజ్యసభ సీటు ఇచ్చే విధంగా రాహుల్‌కు పార్టీ అధ్యక్షుడు సీఎం స్టాలిన్ తరపున కనిమొళి సూచించి వచ్చినట్లుగా చర్చ ఊపందుకుంది. కాగా ఢిల్లీలో తొలి దశ కాంగ్రెస్– డీఎంకే చర్చలు సంతృప్తి కరంగా సాగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల పొత్తు త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది.
రెండు నెలలుగా ఎదురు చూపు
డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదన్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్‌ఆళ్వాలు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్‌కుమార్‌తో కూడిన కమిటీ భేటీ సీట్ల పందేరం గురించి సమావేశమైంది. తమకు కావాల్సిన నియోజకవర్గాల జాబితాను అందజేశారు. ఇది ప్రక్రియ జరిగి రెండు నెలలు అవుతున్నా, డీఎంకే నుంచి ఎలాంటి స్పందన లేదు. సీట్ల పందేరం విషయంగా డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ ఏఐసీసీ నేతలు ప్రవీణ్ చక్రవర్తితో పాటూ టీఎన్‌సీసీ నేతలు పలువురు విజయ్‌తో చేతులు కలుపుద్దామన్న నిర్ణయంతో వ్యాఖ్యల తూటాలను అందుకోవడం డీఎంకేకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. తాజాగా కాంగ్రెస్ 70 స్థానాలను ఆశిస్తుండడంతోనే డీఎంకే ముందడుగు వేయకుండా మౌనం వహించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారంలో వాటా ఆశించే విధంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదనక్కర్ గళాన్ని విప్పడాన్ని డీఎంకే నిశితింగా పరిశీలించే పనిలో పడింది. తమిళనాట సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదన్నది ఆది నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈసారి సంపూర్ణ మెజారిటీతో తాము నెగ్గినా, నెగ్గక పోయినా, అధికారంలో వాటా దిశగా కాంగ్రెస్ చూపు ఉండడాన్ని డీఎంకే పరిగణించింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై సైతం వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో పందేరం చర్చను డీఎంకే పక్కన పడేసింది.
రాహుల్‌తో కనిమొళి భేటీ
కాంగ్రెస్ కొత్త పల్లవి
అన్నాడీఎంకేతో బీజేపీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు డీఎంకేనే దిక్కుగా మారింది. అయితే విజయ్ నేతృత్వంలో టీవీకే ఆవిర్భావంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు తొలుత డీఎంకేకు వ్యతిరేకంగా స్వరాన్ని అందుకున్నారు. అదే సమయంలో తమతో కలిసి వస్తే అధికారంలో వాటా అంటూ విజయ్ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ నేతలు సైతం వాటా పల్లవి అందుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం విజయ్ టీవీకేతో కలిసి ఎన్నికల్లోకి వెళ్దామన్న నినాదాన్ని బహిరంగానే అందుకునేపనిలో పడ్డారు. ఈ నినాదం విస్తృతం కావడంతో ప్రచారానికి ముగింపు పలికే విధంగా ఏఐసీసీ పెద్దల ద్వారా డీఎంకే చెక్ పెట్టించింది. అదే సమయంలో డీఎంకేతో కూటమి బంధం పదిలం చేసుకోవడంతో పాటుగా ముందుగానే సీట్ల పందేరం ముగించే విధంగా ఏఐసీసీ పెద్దలు ఓ కమిటీని రంగంలోకి దించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి డీఎంకే కూటమిలో కాంగ్ర
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి డీఎంకే కూటమిలో కాంగ్ర
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి డీఎంకే కూటమిలో కాంగ్ర


