తిరుత్తణికి పోటెత్తిన భక్తులు
తిరుత్తణి: తై కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం సందడి నెలకొంది. తైమాసం కృత్తికతో పాటు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు భక్తులు స్వామి పోటెత్తారు. వేకువజామున స్వామికి అభిషేక పూజలు చేశారు. బంగారు కవచంతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. మెట్ల మార్గం మీదుగా భక్తులు కొండ ఆలయానికి చేరుకున్నారు. దీంతో మాడ వీధులు కిక్కిరిసాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ కనిపించింది. సాయంత్రం శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వెండి నెమలి వాహనంలో కొలువుదీరారు. ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.
తిరుత్తణికి పోటెత్తిన భక్తులు


