కూలిన ట్రాఫిక్ సిగ్నల్
– తప్పిన పెను ప్రమాదం
తిరుత్తణి: తిరుత్తణిలో ట్రాఫిక్ సిగ్నల్ అకస్మాత్తుగా కూలడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వివరాలు.. తిరుత్తణి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారంతో పాటు ప్రమాదాలు అరికట్టే విధంగా పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అయితే సక్రమంగా సిగ్నల్స్ పనిచేయక పోవడంతో దిష్టిబొమ్మగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మపోసీ రోడ్డులో స్టేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు సహా నిత్యం రద్దీగా వుండే రోడ్డులో మంగళవారం సాయంత్రం సిగ్నల్ అడుగుభాగం ఇసున స్తంభం తుప్పుపట్టి కూలిపోయింది. రోడ్డులో సిగ్నల్ కూలడంతో అటువైపు వెళ్లిన వాహన చోదకులు, ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సిగ్నల్ తొలగించారు.


