దేశ క్షేమం కోసం యాగ పూజలు
వేలూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో సోమవారం సాయంత్రం భరతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక యాగ పూజలు చేశారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ఉదయం జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పీఠంలో ప్రత్యేక యాగ పూజలు చేశారు. అనంతరం పీఠంలో ప్రతిష్టించిన భరతమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి దేశం క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక యాగ పూజలు చేశారు. పీఠం ప్రారంభించి 20 సంవత్సరాలుగా జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటూ దేశ క్షేమం కోసం ఏటా యాగ పూజలు చేస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. అనంతరం పీఠానికి వచ్చిన భక్తులకు స్వీట్లు, పంచదారం పంపిణీ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో అవసరమైన భక్తులకు మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాగ పూజల్లో పాలుపంచుకున్నారు.
భరతమాత విగ్రహం ఎదుట యాగ పూజలు చేస్తున్న దృశ్యం, పుష్పాలంకరణలో ఉన్న భరత మాత
దేశ క్షేమం కోసం యాగ పూజలు


