స్టెరాయిడ్ల వాడకంతో పెరిగిన గ్లాకోమా కేసులు
సాక్షి, చైన్నె: విస్తృతంగా వాడుతున్న స్టెరాయిడ్‌ల రూపంలో సెకండరీ గ్లాకోమా ఉద్బవిస్తున్నట్టు వై ద్యులు ప్రకటించారు. స్టెరాయిడ్ల విస్తృతం వాడకం, పర్యవేక్షణ లేక పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ద్వితీయ గ్లాకోమాకు ప్రధాన ట్రిగ్గర్‌గా ఉద్భవిస్తున్నదని హెచ్చరిస్తున్నారు. ఇది తిరిగి పొందలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితిగామారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే 12 నుంచి 13 మిలియన్ల మంది గ్లాకోమాతో జీవిస్తున్నటు అంచనా వేశారు. ఈ సంఖ్య 2040 నాటికి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తాజాగా జరిపిన పరిశోధన వివరాలను చైన్నెలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రి క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి ప్రకటించారు. వైద్య పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్ మందులు లేదా కంటి చుక్కలను ఉపయోగించే రోగులలో గ్లాకోమా ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కంటి ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది, ఇది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందన్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా, వైద్యులు నిర్ధారణ చేయబడిన గ్లాకోమా కేసులలో గణనీయమైన పెరుగుదలను గుర్తించామన్నారు. గ్లాకోమా సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వ్యక్తులలో నిర్ధారణ అవుతుందని, అయితే, తాజాగా స్టెరాయిడ్‌ల వాడకంతో మరింత విస్తృతం అవుతోందన్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చికిత్సను పొందడం, వార్షిక స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా సమస్య నుంచి గట్టెక్క వచ్చు అని అని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ మురళి వివరించారు. గ్లాకోమాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి భారతదేశం అంతటా డయాబెటిక్ రోగులకు ఉచిత గ్లాకోమా చికిత్సను అందించేందుకు నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ సేవలు ఉంటాయని, అవసరమైన వారు 95949 01868 కు కాల్ చేయవచ్చని సూచించారు.


