కేజీహెచ్‌ చిత్ర బ్యానర్‌లో శివకార్తికేయన్‌? | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ చిత్ర బ్యానర్‌లో శివకార్తికేయన్‌?

Jan 28 2026 7:04 AM | Updated on Jan 28 2026 7:04 AM

కేజీహెచ్‌ చిత్ర బ్యానర్‌లో శివకార్తికేయన్‌?

కేజీహెచ్‌ చిత్ర బ్యానర్‌లో శివకార్తికేయన్‌?

తమిళసినిమా: కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలలో ఒకరిగా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్‌. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెడుతూ వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఈయనకు వరుసగా భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయనే చెప్పాలి. శివకార్తికేయన్‌ తాజాగా నటించిన పరాశక్తి చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా తాజాగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటించడానికి ఈయన సిద్ధమవుతున్నారు. కాగా తదుపరి హోమ్‌ బలే ప్రొడక్షనన్స్‌ సంస్థలో నటించటానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. కన్నడంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా రాణిస్తున్న హోమ్‌ బలే సంస్థ ఇంతకుముందు కేజీఎఫ్‌ చిత్రాలతో పాటు కాంతార, కాంతార చాప్టర్‌ –1 పంటి సంచలన విజయం సాధించిన చిత్రాలను నిర్మించాయి. కాగా ఇప్పుడు నేరుగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. తొలి ప్రయత్నంగా శివకార్తికేయన్‌ హీరోగా భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా దీన్ని ఓ ప్రముఖ కన్నడ దర్శకుడు తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయనెవరు ? కథేంటి? ఇందులో నటించే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. శివకార్తికేయన్‌ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రంపై పూర్తి దృష్టి సారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement