ఘనంగా తైమాస ఉత్సవాలు
వేలూరు: తమిళ తైమాసంలో నిర్వహించే తై క్రిత్తిక, తైపూజోత్సవాలను వేలూరు, తిరువణ్ణామలై ఆలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో తైపూజోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వేలూరు రత్నగిరి మురుగన్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ప్రార్థనలు చేశారు. వాలాజ సమీపంలోని శ్రీ దన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీఠంలో శక్తి గాంచిన పరిహార దైవాలతో పాటు ఫలితాలిచ్చే హోమ పూజలు రోజూ జరుగుతుంది. అనంతరం పీఠంలో తైపూసాన్ని పురష్కరించుకొని స్వామి వార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి దీపారధన పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక పౌర్ణమి హోమ పూజలు చేశారు. అనంతరం పీఠంలోని 27 నక్షత్రాలకు పరిహార పూజలు, పుష్పాలంకరణ జరిగింది. అదే విధంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని మురుగన్ ఆలయాల్లో తైపూజోత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తులకు అంబలిని ప్రసాదంగా అందజేశారు. ఇదిలా ఉండగా వేలూరు, తిరువణ్ణామలై అలయాల్లోని మురుగర్ ఆలయాల్లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, దీపారధన, పుష్పాలంకరణలు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కావళ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.


