త్రివర్ణశోభితం! | - | Sakshi
Sakshi News home page

త్రివర్ణశోభితం!

Jan 27 2026 8:23 AM | Updated on Jan 27 2026 8:23 AM

త్రివ

త్రివర్ణశోభితం!

● ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పు

న్యూస్‌రీల్‌

ఘనంగా గణతంత్ర సంబరాలు

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

మెరీనా తీరంలో కోలాహలం వేడుక

జాతీయ పతాకం ఎగుర వేసిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

పతకాలను ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌

ఎగ్మోర్‌లో రైల్వే స్టేషన్లో నిర్వహణ పనులు

తిరువొత్తియూరు: ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌లో మరమ్మతు పనులు కారణంగా, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవల్లో అధికారులు మార్పులు చేశారు. ఈ మేరకు 3 రైళ్లు చైన్నె బీచ్‌ రైల్వే స్టేషన్‌ నుండి నడుస్తాయి. వీటిలో చైన్నె బీచ్‌– ముంభై సీఎస్‌ఎమ్‌డీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్‌ 4 వరకు, చైన్నె బీచ్‌– హైదరాబాద్‌ చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 4 నుండి ఏప్రిల్‌ 5 వరకు, హైదరాబాద్‌ –చైన్నె బీచ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 3 నుండి ఏప్రిల్‌ 4 వరకు బీచ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుతుందని ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించారు.

డీఎండీకే, పీటీ పార్టీలతో మంతనాలు

సాక్షి, చైన్నె : కూటమి విషయంగా లోక్‌ సభన్‌ విందు సమయంలో డీఎండీకే, పుదియ తమిళగం నేతలతో బీజేపీ, అన్నాడీఎంకే నేతలు తీవ్ర మంతనాలలో మునగడం చర్చకు దారి తీసింది. ప్రేమలత విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, కృష్ణస్వామి నేతృత్వంలోని పుదియ తమిళగంలు ఇంత వరకు కూటమి విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌ భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి విందు ఏర్పాటు చేశారు. ఇందుకు డీఎండీకే తరపున సుదీష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్‌ పదిహేను నిమిషాల పాటూ సుదీష్‌తో చర్చల్లో మునగడం గమనార్హం. ఈ ఇద్దరు విందు కార్యక్రమం జరిగిన ప్రదేశానికి కాస్త దూరంలో తీవ్రంగా చర్చించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. అలాగే కృష్ణ స్వామితో అన్నాడీఎంకే నేతలు మంతనాలలో జరపడం గమనార్హం.

ఘనంగా కలైమామణి

నాగిరెడ్డి అవార్డుల వేడుక

సాక్షి, చైన్నె: పాటర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ (పీసీసీ) – క్యాన్సర్‌ అల్లేవియేషన్‌ ఫౌండేషన్‌ నేతృత్వంలో కలైమామణి డాక్టర్‌ బి. నాగిరెడ్డి మెమోరియల్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వేడుకను ఘనంగా నిర్వహించారు. చైన్నె వడపళణిలోని విజయ హెల్త్‌ సెంటర్‌ ప్రాంగణంలోని పాటర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో కథాడి ఎస్‌ రామమూర్తి (నటుడు, దర్శకుడు, రచయిత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌), డాక్టర్‌ వి. సుకుమార్‌ ఎంఎస్‌. (ఆర్థోపెడిషియన్‌), ఎస్బీఎస్‌. రామన్‌ (థియేటర్‌ డైరెక్టర్‌), డాక్టర్‌ సుధా శేషయ్యన్‌ (సాహిత్యం, ఆధ్యాత్మికత), ఎస్డి విజయ్‌ మిల్టన్‌ (సినిమాటోగ్రాఫర్‌, ఫిల్మ్‌ డైరెక్టర్‌)లకు ప్యాటర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. విజయరాఘవన్‌, డాక్టర్‌ ఆదర్శ్‌ రాఘవన్‌లు అవార్డులను అందజేసిన సత్కరించారు. వారి విజయాలు ,వారు ఎంచుకున్న రంగంలో వారి అద్భుతమైన సేవలను ప్రస్తావించి నగదు పురస్కారం అందజేశారు. అవార్డు గ్రహీతలందరూ తమ ప్రసంగాలలో డాక్టర్‌ బి నాగి రెడ్డి సమాజానికి చేసిన కృషి, చలనచిత్ర పరిశ్రమలో , ఆరోగ్య రంగంలో అందించిన సేవలను గుర్తు చేశారు.

వాడీవేడిగా

గ్రామసభలు

తిరువళ్లూరు: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలను నిర్వహించారు. పూండి యూనియన్‌ తిరుప్పాచ్చూర్‌లో జరిగిన గ్రామసభలో కలెక్టర్‌ ప్రతాప్‌, డీఆర్వో సురేష్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ జయుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. అత్తివాక్కంలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గ్రామసభను బహిస్కరించిన నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అత్తివాక్కంలో శ్మశాన వాటిక ఏర్పాటు, వీధిధీపాలు ఏర్పాటు, రోడ్డు వసతి కల్పించాలని కోరుతూ సభను బహిస్కరించి నిరసన చేపట్టారు. అలాగే వెంగత్తూరులో రోజూవారీగా చెత్తకుప్పలను సేకరించడం లేదని, వీధిధీపాలు సైతం వెలగడంతో లేదని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు శాంతించకపోవడంతో అర్ధాంతరంగా సభను ముగించి వెళ్లిపోయారు. కాగా చాలా గ్రామాల్లోనూ తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది.

సాక్షి, చైన్నె: దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడలా ఉదయం జాతీయ పతావిష్కరణ ఘనంగా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో, రాజకీయ పార్టీల కార్యాలయాలలో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెట్టారు. ఆయా విద్యాసంస్థల్లో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

మెరీనా తీరంలో..

చైన్నె మెరీనా తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో శ్రామిక విగ్రహం వద్ద బ్రహ్మాండ ఏర్పాట్లతో వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే జనం త్రివర్ణ పతకాలను చేతబట్టి మెరీనా తీరం మార్గంలో రోడ్డుకు ఇరువైపుగా నిలబడి దేశభక్తి భావం మిన్నంటే విధంగా నినదించారు. చిరు జల్లులతో వర్షం పడుతున్నా, దేశ భక్తి విషయంలో తగ్గేది లేదన్నట్టుగా జనం కదిలారు. తొలుత సీఎం ఎంకే స్టాలిన్‌ శ్రామిక విగ్రహం వద్దకు చేరుకున్నారు. దారి పొడవున వేచి ఉన్న ప్రజలకు అభివాదం తెలియజేశారు. రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి శ్రామిక విగ్రహం వద్దకు రాగానే ఆయనకు సీఎం స్టాలిన్‌ ఆహ్వానం పలికారు. పుష్పగుచ్ఛం అందజేశారు. త్రివిధ దళాలకు చెందిన అధికారులను ఈ సందర్భంగా ీసీఎస్‌ మురుగానందం గవర్నర్‌ రవికి పరిచయం చేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎగుర వేశారు. ఈ సమయంలో భారత కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌ ఆకాశం నుంచి పుష్పపు జల్లులు కురిపించింది. మెరీనా తీరంలో గుమికూడిన ప్రతి ఒక్కరు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

మారుమోగిన తమిళం

జాతీయ పతాక ఆవిష్కరణతో త్రివిధ దళాల కవాతు, సీఆర్‌పీఎఫ్‌, మహిళా కమాండో బలగాలు, సీఐఎస్‌ఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌, తమిళనాడు ప్రత్యేక పోలీసు విభాగం, పోలీసు విభాగం, రిజర్వ్‌ పోలీసు, కోస్టల్‌ సెక్యూరిటీ గ్రూపు, కోస్ట్‌గార్డ్‌ విన్యాసాలు, అశ్వదళాల మార్చ్‌ ఫాస్ట్‌లు జరిగాయి. వీరి నుంచి గౌరవ వందనాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి స్వీకరించారు. తర్వాత తమిళనాడు చరిత్రను, సంస్కృతి సంప్రదాయాన్ని, భాషాభిమానాన్ని, తమిళ నినాదాన్ని చాటే విధంగా విద్యార్ధినుల సాంస్కృతిక ప్రదర్శనలు హోరెత్తాయి. తమిళం వర్దిల్లాలి అన్న గీతాలే కాదు, తమిళం గొప్పతనాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరిగాయి. అలాగే గ్రామీణ కళల్ని, దేశభక్తిని చాటి చెప్పే రీతిలో, వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబంబించే విధంగా ఆయా రాష్ట్రాల విద్యార్థినుల ప్రదర్శనలు అలరించాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా కర్ణాటక, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు మరింత ఆకట్టుకున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో వివిధ విభాగాలు శకటాలు అబ్బుర పరిచాయి. ఇందులో క్రీడల శాఖ ఘనతను చాటే ప్రదర్శన మరింత ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటూ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ఐఓబీలో జెండాకు అధికారుల వందనం

పెరంబూరులో అష్రయా ప్రత్యేక బడిలో ప్రత్యేక ప్రతిభావంతులకు చేయూతను అందించే విధంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ రైల్వే మహిళాసంక్షేమం ప్రధాన కార్యాలయం సంస్థ అధ్యక్షురాలు సోనియా సింగ్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఇక్కడి ప్రత్యేక విద్యార్థులతో కలిసి నిర్వాహకులు ఆనందాన్ని పంచుకున్నారు.

– సాక్షి, చైన్నె

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ గోగర్భం డ్యాం వద్ద ఉన్న ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వద్దకు చేరుకుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,131 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

విశిష్ట పతకాల ప్రదానం

విశిష్ట సేవా పురస్కారాలు, అన్నా, గాంధి పతకాలు, బిరుదులు, ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవం సీఎం స్టాలిన్‌ చేతల మీదుగా జరిగింది. అన్నా పతకంను అగ్నిమాపక శాఖకు చెందిన వి. శంకర్‌, పి. సురేష్‌, ఎస్‌ రమేష్‌కుమార్‌లకు ప్రదానం చేశారు. తామర భరణి నదిలో కొట్టుకెళ్తున్న ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణ త్యాగం చేసిన పీటర్‌ జాన్సన్‌ తరపున ఆయన సతీమణి జెస్సీ అన్నా పతకం అందుకున్నారు. కోట్టై అమీర్‌ మత సామరస్య బిరుదును తిరుప్పూర్‌కు చెందిన ఎం కలీముల్లాకు ప్రదానం చేశారు. అత్యాధునిక పద్దతులను ఉపయోగించి అధిక శాతం వరి దిగుబడి సాఽధించినందుకు గాను వ్యవసాయ శాఖ నేతృత్వంలో తంజావూరుకు చెందిన జి. వీరమణికి సీ నారాయణ స్వామి నాయుడు అవార్డు , రూ. ఐదు లక్షల నగదును అందజేశారు. మహాత్మా గాంధి పతకాలను విల్లుపురం జోన్‌కు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు పి నటరాజన్‌, విల్లుపురం జిల్లాఅరో వెళ్లి పోలీసు స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. సత్యా నందన్‌, కళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం పోలీసు స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. మణిగండన్‌, కడలూరు జిల్లా పుదూర్‌ పోలీసు స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె నటరాజన్‌,సేలం జిల్లా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ విపీ కన్నన్‌కు ప్రదానం చేశారు.ఇక, ఉత్తమ పోలీసు స్టేషన్‌ గా మదురై నగరం ఇన్‌స్పెక్టర్‌ పి భూమినాథన్‌ తొలి బహుమతి, తిరుప్పూర్‌నగరం ఇన్‌స్పెక్టర్‌ కె ప్రేమ రెండవ, కోయంబత్తూరు ఇన్‌స్పెక్టర్‌ పి.చిన్న కమనన్‌ మూడో బహుమతి అందుకున్నారు. గణతంత్ర వేడుకల అనంతరం సీఎం స్టాలిన్‌ ఎక్స్‌ పేజిలో ట్వీట్‌ చేశారు. వైవిధ్య భరితమైన భారత దేశాన్ని , సమైఖ్య భారత దేశానికి ప్రతీకగా అందరం కలిసి గెలుద్దాం..అంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా గవర్నర్‌ లోక్‌భవన్‌లో ఇచ్చిన విందును డీఎంకె కూటమి పార్టీలు బహిష్కరించాయి. కాగా కేంద్ర ప్రాంతం పుదుచ్చేరి సముద్రతీరంలో బ్రహ్మాండంగా జరిగిన వేడుకలలో గవర్నర్‌ కై లాసనాథన్‌, సీఎం రంగస్వామి తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు సోమవారం మిన్నంటాయి. తివ్రర్ణ శోభితంగా వాడ వాడలా జాతీయ జెండా రెపరెప లాండింది. చైన్నె మెరీనా తీరంలో రిపబ్లిక్‌ డే సంబరాలు కోలాహలంగా సాగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎగుర వేశారు. విశిష్ట సేవలు అందించిన వారికి సీఎం ఎంకే స్టాలిన్‌ పతకాలను ప్రదానం చేశారు.

త్రివర్ణశోభితం! 1
1/7

త్రివర్ణశోభితం!

త్రివర్ణశోభితం! 2
2/7

త్రివర్ణశోభితం!

త్రివర్ణశోభితం! 3
3/7

త్రివర్ణశోభితం!

త్రివర్ణశోభితం! 4
4/7

త్రివర్ణశోభితం!

త్రివర్ణశోభితం! 5
5/7

త్రివర్ణశోభితం!

త్రివర్ణశోభితం! 6
6/7

త్రివర్ణశోభితం!

త్రివర్ణశోభితం! 7
7/7

త్రివర్ణశోభితం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement