విజయవంతంగా క్రీడోత్సవం
సాక్షి, చైన్నె : ముక్తి – ఎంఎస్ దాదా ఫౌండేషన్ నేతృత్వవంలో మీనంబాక్కంలోని ఏఎం జైన్ కళాశాల మైదానంలో జరిగిన క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న వారిలోని స్ఫూని, అసాధారన సామర్థ్యాలను వెలికి తీసే విధంగా ఇక్కడ పోటీలు జరిగాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి, వన్య ప్రాణుల నేర నియంత్ర బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ తేన్ మొళి, మోహన్ గోయోంకా ఫౌండేషన్ ట్రస్టీ మోహన్, అర్జున అవార్డు గ్రహీత, పారా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అరున్ మొళి అరుణ గిరి, ఎంఎస్ దాదా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మీనా దాదాతో పాటుగా వివిధ రంగాల ప్రతినిధులు, ట్రస్టీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు, పిల్లలందరికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.


