ఎల్‌కే అక్షయ్‌కుమార్‌ కొత్త చిత్రం షురూ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌కే అక్షయ్‌కుమార్‌ కొత్త చిత్రం షురూ

Jan 27 2026 8:12 AM | Updated on Jan 27 2026 8:12 AM

ఎల్‌కే అక్షయ్‌కుమార్‌ కొత్త చిత్రం షురూ

ఎల్‌కే అక్షయ్‌కుమార్‌ కొత్త చిత్రం షురూ

తమిళసినిమా: సిరై చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న వర్గమాన నటుడు ఎల్‌కే. అక్షయ్‌కుమార్‌. కాగా తాజాగా ఈయన ఫాజిల్‌ జోసఫ్‌తో కలిసి నటిస్తున్న చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. జాన్‌విజయ్‌, సత్యన్‌, జాఫర్‌ సాధిక్‌, నోబల్‌. కే.జేమ్స్‌, అరుణాచలేశ్వరన్‌ .పీఏ, సాధిక్‌ హాసన్‌, నటి ఐశ్వర్య శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విఘ్నేశ్‌ వడివేల్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా వైవిధ్యభరిత కథాంఽశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఈ చిత్రాన్ని తమిళం, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా చిత్రానికి రావడి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా రావడి చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి లియోన్‌ బ్రిట్టో ఛాయాగ్రహణం, జన్‌ మార్టిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

రావడి చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement