మువ్వన్నెల జెండా రెపరెపలు
కొరుక్కుపేట : చైన్నెనగరంలోని తెలుగు సంఘాలు, తెలుగు పాఠశాల, కళాశాలల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు.
చైన్నె పెరియామేట్‌లోని మహర్షి విద్యా మందిర్ ఘనంగా నిర్వహించారు. సీనియర్ సెకండరీ పాఠశాలలో కరస్పాండెంట్ టీవీ రామకుమార్, సీవీ సుబ్బారావు, ట్రస్టీలు దేసు లక్ష్మీనారాయణ, సీఆర్ కిషోర్‌బాబు, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపల్ కవిత, మేనేజర్‌లు శ్రీలత, వి.శివకుమార్ పాల్గొన్నారు. స్థానిక వేపేరే హైరోడ్‌లో ఉన్న మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్ జాతీయజెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ప్రొటెం చైర్మన్ ఏ.భాస్కర్, రికార్డింగ్ సెక్రటరీ శేషం రమేష్‌ల పర్యవేక్షణలో యవ్వనస్తుల రిట్రీట్ నిర్వహించారు. పాటల పోటీలకు విజేతలను బహుమతులు ప్రదానం చేశారు. చైన్నె జార్జి టౌన్ గిడ్డంగి వీధిలో ఉన్న ఇండియా వైశ్య అసోసియేషన్ ప్రాంగణంలో సంఘ అధ్యక్షుడు అజంతా డాక్టర్ శంకరరావు, కె.శ్రావణ్‌కుమార్, కె.నవీన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. చైన్నెలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ నిర్వహణలో ఉన్న కేటీసీటీ , ఎస్‌కేపీడీ డ ప్రాథమిక , మహోన్నత పాఠశాలలు, ఎస్‌కేపీసీ మహిళా కళాశాలలో ఘనంగా జరుపుకున్నారు. వైవిఎస్ గ్రూప్ కంపెనీల అధినేత ౖవైవి హరికృష్ణ పాల్గొని ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కేసరి మహోన్నత పాఠశాల మైలాపూర్‌లో విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పాలక కమిటీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఐఐటీ ప్రొఫెసర్ డా.సారఽథ జాతీయజెండా ఆవిష్కరించారు. చైన్నె మైలాపూర్ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు అమరజీవి స్మారక భవనంలో ఘనంగా జరిగాయి. కె.ఆనంద్ కుమార్ రెడ్డి, ఏ వెంకట్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, జె.ఎం.నాయుడు పాల్గొన్నారు. పాల్గొన్నారు. అలాగే.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయులు, అమెరికాలో సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ వేముల పల్లి రాఘవేంద్ర చౌదరి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టారు. తెలుగుపై మక్కువ చూపుతున్న విద్యార్థులకు తనవంతుగా నగదు బహుమతులను డాక్టర్ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాతృభాషపై మక్కువతో అనేకమంది ప్రముఖులు పాఠశాల కార్యదర్శి కేఎస్‌వీ ప్రసాద్, కెన్సెస్ గ్రూప్ అధినేత కె.నరసారెడ్డి, జె.వెంకట రమణ, శైలేంద్ర కుమార్‌లు పాల్గొని వేడుకను జయప్రదం చేశారు.
సేలంలో: సేలం మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.రవికుమార్ జాతీయ జెండాను ఎగురవేసి నివాళులర్పించి స్వాతంత్య్ర సమరయోధులకు, దివ్యాంగులకు సహాయకాలను అందించారు.
తిరువత్తియూరు: చైన్నె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జీకే వాసన్ జెండా ఎగురవేశారు.
తిరువళ్లూరులో: కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతాప్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. పోలీసుల నుంచి ఎస్పీ వివేకానందశుక్లాతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వాహణలో ఉత్తమ సేవలు అందించిన 900 మంది ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అనంతరం ఆదిద్రావిడ, మైనారిటీ సంక్షేమశాఖ, తాడ్కో ఆద్వర్యంలో సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. ఆవడిలోనీ కామరాజర్ నగర్‌లో వున్న శ్రీ వెంకటేశ్వర తెలుగు మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో, గుమ్మిడిపూండి సిప్‌కాట్ సిగ్మా ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు.
పళ్లిపట్టులో: పొదటూరుపేట టౌన్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చైర్మన్ రవిచంద్రన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పళ్లిపట్టు టౌన్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చైర్‌పర్సన్ మణిమేగళై జాతీయ జెండా ఎగురవేశారు. బీడీఓ కార్యాలయంలో బీడీఓ అర్పుదరాజ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. వెళిగరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన జాతీయ వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి..
వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో..
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలూరు కోట మైదానంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందజేసిన పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం సంక్షేమ పథకాలను అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, ఎస్పీ మదివాణన్ పాల్గొన్నారు.
తిరువణ్ణామలై జిల్లాలో:.
తిరువణ్ణామలైలోని క్రీడా మైదానంలో కలెక్టర్ భాస్కరపాండియన్ జాతీయ జెండాను ఎగరవేసి లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఎస్పీ కార్తికేయన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలోనూ కలెక్టర్‌లు జాతీయ జెండాను ఎగరవేశారు.
మువ్వన్నెల జెండా రెపరెపలు
మువ్వన్నెల జెండా రెపరెపలు
మువ్వన్నెల జెండా రెపరెపలు
మువ్వన్నెల జెండా రెపరెపలు
మువ్వన్నెల జెండా రెపరెపలు


