మీరే అసలైన సైన్యం..! | - | Sakshi
Sakshi News home page

మీరే అసలైన సైన్యం..!

Jan 27 2026 8:12 AM | Updated on Jan 27 2026 8:12 AM

మీరే

మీరే అసలైన సైన్యం..!

శ్రమిద్దాం..గెలుద్దాం..

మహిళాలకు సీఎం స్టాలిన్‌ పిలుపు

బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారానే మాదక ద్రవ్యాల సరఫరా

సాక్షి, చైన్నె: డీఎంకేకు మహిళా కేడర్‌ కీలక సైన్యంగా మారిందని, అందరూ శ్రమిద్దాం ...గెలుద్దాం ..ద్రావిడ మోడల్‌ 2.ఓను అధికారంలోకి తీసుకొద్దాం అని సీఎం స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. డీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో తంజావూరు వేదికగా డెల్టా జిల్లాలను ఏకం చేస్తూ మహిళలు వర్ధిల్లాలి నినాదంతో బ్రహ్మాండ మహానాడు సోమవారం జరిగింది. ఇందులో పెద్దఎత్తున మహిళా లోకం తరలి వచ్చారు. డీఎంకే పార్టీ జెండావర్ణంతో కూడిన వస్త్రాలను ధరించి మహిళలు తమ మద్దతును తెలియజేశారు. ఇందులో డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ప్రసంగిస్తూ, తమిళనాడులోకి చొరబడాలని పాసిస్టులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ, ఇక్కడ మహిళా సైన్యం రక్షణగా ఉన్నంత కాలం డీఎంకేను గానీ, ఈ రాష్ట్రాన్ని గానీ ఎవ్వరూ తాక లేరని హెచ్చరించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, డబుల్‌ ఇంజిన్‌ అంటున్నారని పీఎం మోదీ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, కాలం చెల్లిన ఈ ఇంజన్లు, డీఎంకే అనే ఇంజన్‌ ముందు తట్టుకోలేవని హెచ్చరించారు.

డబుల్‌ కాదు.. డబ్బా ఇంజిన్‌

సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, మణీపూర్‌ ఘటనలను గుర్తు చేస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలపై విరుచుకు పడ్డారు. మణీపూర్‌లో మంత్రులు, ప్రజా ప్రతినిధులకే భద్రత కల్పించ లేని వాళ్లు తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారానే దేశంలోని మాదక ద్రవ్యాల చొరబడుతున్నట్టుగా మీడియాల్లో కథనాలు వస్తుంటే, చొరబాటును కట్టడి చేయలేని వాళ్లంతా తమిళనాడు మత్తులో మునిగి ఉందని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాత కూటమికి కొత్త రంగులు వేసుకుని ప్రగల్భాలను మోదీ పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తమరిది డబుల్‌ కాదు...డబ్బా ఇంజిన్‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ కూటమిలో ఉన్న వాళ్లంతా ఈడీ, సీబీఐ, ఐటీ అంటూ అనేక కేసులు ఎదుర్కొంటూ బానిసలుగా మారిన వారే ఉన్నారని ధ్వజమెత్తారు. ఎంత మందితో వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలకు పదును పెట్టినా, ఇక్కడున్న మహిళాసైన్యం మద్దతుతో తిప్పికొట్టేందుకు తాను సిద్ధం అని సవాల్‌ చేశారు. ఇక్కడున్న మహిళా లోకం మరింతగా శ్రమించాలని, గెలుద్దామని, ద్రావిడ మోడల్‌ 2.ఓను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపు నిచ్చారు. ముందుగా తంజావూరులో ఉదయం బ్రహ్మాండ కార్యక్రమం జరిగింది. ఇటీవల అన్నాడీఎంకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి డీఎంకేలో చేరిన వైద్యలింగం తన బలాన్ని చాటుకున్నారు. 10 వేల మంది స్టాలిన్‌ సమక్షంలో వైద్యలింగం మద్దతు దారులు డీఎంకేలో చేరారు.

మీరే అసలైన సైన్యం..! 1
1/1

మీరే అసలైన సైన్యం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement