క్లుప్తంగా
గోనె సంచిలో యువకుడి మృతదేహం గుర్తింపు
అన్నానగర్: చైన్నెలోని అడైయార్ ఇందిరా నగర్‌లోని ద్విచక్ర వాహన విక్రయ కేంద్రం సమోపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన ఒక గోనె సంచి పడి ఉంది. దాని నుండి రక్తం ప్రవహించడం చూసి షాక్ అయిన బాటసారులు అడైయార్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గోనె సంచెను తెరిచి చూసి ఓ యువకుడిని నరికి చంపినట్లు గుర్తించారు. తర్వాత ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలించగా, సోమవారం తెల్లవారుజామున 12.30గంటల ప్రాంతంలో మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడి మృతదేహం ఉన్న గోనె సంచిని రోడ్డుపై విసిరేస్తున్నట్లు గుర్తించారు. వారు బెసెంట్ నగర్, సిద్ధిర్ నగర్ ప్రాంతాల నండి వచ్చినట్లు వెల్లడైంది. అసిస్టెంట్ కమిషనర్ మురుగేశన్, ఇనెస్పెక్టర్ ఇలంగాని మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్, వారి చిత్రాలను ఉపయోగించి అనుమానితులను గుర్తించడానికి యత్నిస్తున్నారు. అడైయార్ పరిసర ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన యువకులు ఎవరైనా అదృశ్యమయ్యారా అనే దానిపై కూడా వారు సమాచారాన్ని సేకరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్న స్థితిలో ఓ యువకుడిని దారుణంగా చంపి, అతని మృతదేహాన్ని గోనే సంచిలో మోసుకెళ్లి రద్దీగా ఉండే రోడ్డుపై విసిరేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
అమ్మవారి పురాతన విగ్రహం లభ్యం
తిరువొత్తియూరు: ఉత్తరమేరూర్ సమీపంలో ఉన్న నెయ్యాడుపాక్కం సయ్యా నదిలో లభ్యం అయిన అమ్మవారి విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఉత్తరమేరూర్ సమీపంలో ఉన్న నెయ్యాడుపాక్కం ఇళయనార్వేలూర్ మధ్య సెయ్యారు నది ప్రవహిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ నదిని దాటి వాలాజాబాద్, కాంచీపురం, ఉత్తరమేరూర్ వంటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో నదిపై వంతెన లేకపోవడంతో, వరదలు వచ్చినపప్పుడు సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. దీన్ని నివారించడానికి గత సంవత్సరం సెయ్యారు నదిపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిరంతరం జరుగుతున్న ఈ పనుల కోసం ఆదివారం నదిలో గుంతలు తవ్వారు. అప్పుడు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహం ఒకటి దొరికింది. తర్వాత దొరికిన అమ్మవారి విగ్రహాన్ని నెయ్యాడుపాక్కం గ్రామ ప్రజలు అలంకరించి పూజించారు. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరమేరూర్ తాహసీల్దార్ నటరాజన్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి గ్రామ ప్రజలు నుండి దొరికిన అమ్మవారి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దొరికిన అమ్మవారి విగ్రహం ఏ కాలానికి చెందింది అనే దానిపై రెవెన్యూ అధికారులు పరిశోధన చేస్తున్నారు.
33 పంచాయతీల్లో గ్రామసభలు
పళ్ళిపట్టు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొడివలసలో నిర్వహించిన గ్రామసభలో ఆదాయం. ఖర్చు వివరాల పట్టికను ప్రవేశపెట్టి గ్రామీణులు వివరాలు తెలుసుకున్నారు. వివరాలు.. పళ్లిపట్టు యూనియన్‌లోని 33 గ్రామ పంచాయతీల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించారు. కొడివలస పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ గ్రామ కార్యదర్శి హేమనాదన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిప్యూటీ బీడీఓ రఘుపతి, డీఎంకే మండల కార్యదర్శి బీడి. చంద్రన్ సహా గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలో ఆదాయం ఖర్చులకు సంబందించిన నివేదికను ప్రవేశపెట్టారు. గ్రామీణులు దాన్ని తనిఖీ చేశారు. అలాగే కలైంజర్ ఇళ్ల నిర్మాణ పథకం ద్వారా కొత్తంగా ఎంపిక చేసి లబ్ధిదారుల వివరాలకు సంబందించిన జాబితా గ్రామసభలో ప్రవేశపెట్టారు. వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున పరిసర ప్రాంతాలు పరిశుభ్రతకు సంబంధించి అధికారులు అవగాహన కల్పించి తీర్మానం ఆమోదించారు.
అమ్మవారిని దర్శించుకున్న నటి సన
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సీనియర్ సినీ నటి సన సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ రమేష్ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
క్లుప్తంగా


