నూతన రథం ట్రయల్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

నూతన రథం ట్రయల్‌ విజయవంతం

Jan 26 2026 4:49 AM | Updated on Jan 26 2026 6:45 AM

నూతన రథం ట్రయల్‌ విజయవంతం

నూతన రథం ట్రయల్‌ విజయవంతం

సేలం: నామక్కల్‌ – తిరుచెంగోడ్‌ వద్ద అర్ధనారీశ్వరునికి రూ.3 కోట్లతో కొత్త రథం నిర్మించారు. ఈక్రమంలో ట్రయల్‌ నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో భక్తి పారవశ్యంతో రథాన్ని లాగారు. వివరాలు.. ప్రసిద్ధ తిరుచెంగోడు అర్థనారీశ్వర దేవాలయంలోని రథం తమిళనాడు రాష్ట్రంలోనే నాల్గవ అతిపెద్ద రథంగా గుర్తింపు పొందింది. ఇది వైకాసి విశాఖ తీర ఉత్సవంలో అర్ధనారీశ్వరుడిని ప్రదక్షిణ చేయడానికి సుమారు 450 సంవత్సరాల క్రితం రూపొందించారు. ఈక్మరంలోపెరియ తేర కాలం నాటి వైకాసి విశాఖ తేర ఉత్సవాలు పాతబడిపోయాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం కొత్త రథాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇలుప్పై ,వేపతో సహా 100 టన్నుల కలపను ఉపయోగించి 23 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పు కలిగిన ఇనుప ఇరుసుతో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో కొత్త రథాన్ని నిర్మించే పని జూలై 12, 2024న ప్రారంభించారు. ఇటీవల ఇది పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త రథాన్ని ఆదివారం ప్రారంభించారు. తిరుచెంగోడ్‌లోని అర్థనారీశ్వరర్‌ ఆలయం నుండి అస్త్ర తేవర్‌ తిరుమూర్తిని రథంపై తీసుకెళ్లి వెల్లోట్ట వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. తిరుచెంగోడ్‌లోని కై లాసనాథర్‌ ఆలయం నుండి ప్రారంభమైన అస్త్ర తేవర్‌ ఊరేగింపు రథం వద్దకు చేరుకుంది. తిరుచెంగోడ్‌ శాసనసభ సభ్యుడు , కొంగునాడు పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్‌, పరమతి వెల్లోటూరు మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌. మూర్తి, తిరుచెంగోడ్‌ అర్బన్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు నళిని సురేష్‌ బాబు రథాన్ని లాగి వెల్లోట్ట వేడుకను ప్రారంభించారు. ఈ రథం వేదిక నుంచి ప్రారంభమై, తూర్పు రథ వీధి, పశ్చిమ రథ వీధి, దక్షిణ రథ వీధి, ఉత్తర రథ వీధి మీదుగా మళ్లీ వేదికకు చేరుకుంది. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తితో రథాన్ని లాగారు. మైలాట్టం, కరకట్టం, తప్పట్టం వంటి వివిధ గ్రామీణ ప్రదర్శనలతో రథోత్సవం వైభవంగా సాగంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement