సూర్య @50
తమిళసినిమా: జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవు. అయితే ఎవరైనా మంచి చిత్రాలు చేయాలనే ప్రయత్నిస్తుంటారు. అలా వైవిధ్య భరిత కథా చిత్రాలు చేయాలని తపించే హీరోలలో నటుడు సూర్య ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రాలన్నీ విభిన్న కథాంశంతో కూడినవే. అలా తాజాగా నటిస్తున్న చిత్రం కరుప్పు. త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ జే.బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. కాగా తన 47వ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తర్వాత సూర్య తన 48వ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐద విధంగా సుధా కొంగర దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే సూర్య తన 50 వ చిత్రాన్ని సంచలన దర్శకుడు మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచారం నిజం అయితే ఇది సూర్య నటించే 50వ చిత్రం అవుతుంది. దీన్ని వి.క్రియేషన్‌న్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించనున్నట్లు సమాచారం. కాగా వరుసగా విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న దర్శకుడు మారి సెల్వరాజ్ ఇటీవల బైసన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈయన సూర్య హీరోగా చేసే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీనికి మరింత సమయం పడుతుంది.
సూర్య @50


