ఓటు హక్కును వినియోగించుకోవాలి
వేలూరు: కుల మతాలకు అతితంగా ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆదివారం ఉదయం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఓటు హక్కు వినియోగించడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ కుల మతాలు తేడా లేకుండా ఓటు వేసే హక్కు ఉందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈనెల 21వ తేది నుంచి ప్రతి తాలుకాలోను, కళాశాలలోను అవగాహన కార్యక్రమాలు చేపడుతునట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు వృద్ధ ఓటర్లు, యువ ఓటర్లను అభినందించారు. డీఆర్‌ఓ శివసుబ్రమణియన్, సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


