ధనుష్‌కు జతగా..!
తమిళసినిమా: ఒక స్టేజ్ దాటిన తరువాత హీరో అయినా, హీరోయిన్ అయినా జయపజయాలకు అతీతంగా మారుతారు. అలాంటి వారికి మధ్యమధ్యలో ఎదురైయే అపజయాల ప్రభావం పెద్దగా ఉండదు. అలానే ఇటీవల కుబేరా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు ధనుష్, ఆ తరువాత తన స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీకడై చిత్రం ఆశించిన విజయాన్ని అందుకో లేకపోయ్యిందనే విమర్శలను ఎదుర్కొంది. అయినా ధనుస్ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా చిత్రాలు ఉండటం విశేషం. ఇటీవల తేరే ఇష్క్ మే అనే హిందీ చిత్రాన్ని పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా నాలుగు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటించే చిత్రం. ఈ చిత్రాన్ని గోపురం ఫిలింస్ పతాకంపై అన్భుసెళియన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా దీన్ని ఓ యదార్థ ఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇందులో ఇందులో నటి పూజాహెడ్గేను హీరోయిన్‌గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇటీవల సరైన హిట్స్ లేక వరుసగా అవకాశాలను కోల్పోయిన ఈ అమ్మడికి నటుడు సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్ర కమర్షయల్ హిత్ కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అంతేకాకుండా ఇప్పుడీ భామ మళ్లీ బిజీ అవుతున్నారు. నటుడు విజయ్‌కు జంటగా నటించిన జననాయకన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. అదే విధంగా నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ కు జంటగా కాంచన – 4లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ధనుష్‌కు జతగా నటించే అవకాశం వచ్చిందన్నది నిజమైతే ఆమెకు నిజంగా లక్కీనే అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
నటుడు ధనుష్


