ప్రజల సహకారంతోనే.. రాష్ట్రాభివృద్ధి
వేలూరు: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రజలతో పాటూ అఽధికారులు సహకరించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పిలపునిచ్చారు. రాణిపేట జిల్లాలోని రాణిపేట మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో కామరాజర్ భవణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రాణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ చంద్రకళ అధ్యక్షతన జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ. 24 కోట్ల వ్యయంతో చేయనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ: 42 కోట్లు వ్యయంతో పూర్తి అయిన పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 73 వేల మంది లబ్ధిదారులకు రూ: 300 కోట్లు విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. తక్కువ కాలంలోనే ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలను మహానాడు తరహాలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాజుల పేర్లు అఽధికంగా గ్రామాల పేర్లు ఉన్నాయని అయితే రాణిల పేర్లు ఎక్కడా లేవన్నారు. అయితే ప్రస్తుతం రాణి పేరుతో రాణిపేట ఉండటం మహిళలను గుర్తించే విధంగా ఉందన్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు పొందిన 73 వేల మంది లబ్ధిదారుల్లో 55 వేల మంది మహిళలే ఉండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి ఆర్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు జగత్‌రక్షగన్, ఎమ్మెల్యేలు ఈశ్వరప్పన్, మునిరత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేలూరు జిల్లాలోని సోమ, మంగళ వారాల్లోను బూత్ కమిటీ సభ్యులతో పాటు, అధికారులతో సమీక్షించనున్నారు. ఇందుకోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బూత్‌కమిటీ సభ్యులతో సమీక్ష
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లును ముందుస్తుగా సిద్ధం చేసేందుకు ఆయన రాణిపేట జిల్లాలోని బూత్ కమిటీ సభ్యులతో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆ సమయంలో పార్టీ అభివృద్దికి కార్యకర్తలు, యువకులు సైనికుల్లా పని చేయాలన్నారు.


