గీతాకై లాసం ప్రధాన పాత్రలో అంగమ్మాళ్
తమిళనినిమా: ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిని కోడితుణి అనే చిరుకథ అంగమ్మాళ్ చిత్రంగా తెరకెక్కుతోంది. విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్‌జామ్ ఫిలింస్, ఫిరో మూవీ స్టేషన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నామి. కాగా ఈ చిత్రాన్ని స్టోన్‌బెంట్ ఫిలింస్, ఎంజాయ్ ఫిలింస్, ఫిరో మూవీ స్టేషన్ సంస్థలు కలిసి విడుదల చేయనున్నాయి. కాగా ఇందులో నటి గీతా కై లాసం ప్రధాన పాత్రను పోషిస్తుండగా, చరణ్, భరణి, ముల్‌లైయరసీ, తెండ్రల్ రఘునాథన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి రచయిత పెరుమాళ్ మురుగన్ తెలుపుతూ తాను చిరుకథను మాత్రమే ఇచ్చాననీ, దాన్ని సినిమాకు కావలసిన కథాగా మార్చుకోవడం, మరిన్ని హంగులు చేర్చుకోవడం దర్శకుడి పని అని చెప్పారు. తన కథను అర్ధం చేసుకుని పూర్తి చిత్రంగా మార్చడంలో దర్శకుడి ప్రతిభ దాగి ఉందన్నారు. 25 నిమిషాల షార్టు ఫిలింస్‌కు తగిన ఈ కథను చిత్రంగా మార్చడం అంత సులభంగా కాదన్నారు. ఆ పనిని దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ అద్భుతంగా చేశారన్నారు. దీనికి అంజోయ్ సామువేల్ ఛాయాగ్రహణం, ముహమదు మక్యూస్ మన్సూర్ సంగీతాన్ని అందించారు.
అంగమ్మాళ్ చిత్రంలో
నటి గీతా కై లాసం


