ఉద్యోగం పేరుతో రూ.13 లక్షల మోసం
వేలూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.13 లక్షలు మోసం చేసిన వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మయిల్‌వాగనం ఆధ్వర్యంలో గ్రీవెన్‌సెల్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఇందులో కాట్పాడి సమీంలోని వెప్పలై గ్రామానికి చెందిన గోవిందస్వామి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తన కుమారుడు ప్రదీప్‌రాజ్ పదవ తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడన్నాడని తెలిపారు. అయితే తమ గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ సిపాయి తన కుమారుడికి గ్రామ పరిపాలన అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తన వద్ద పలు విడతలుగా రూ.13 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. నెలలు గడుస్తున్నా ఎటువంటి సమాధానం చెప్పడం లేదన్నారు. దీనిపై నిలదీస్తే హత్యా బెదిరింపులు ఇస్తున్నాడన్నారని తెలిపారు. స్పందించిన ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు సమస్యలపై బాధితులు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.


