రెడ్‌ అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ అలర్ట్‌

Oct 22 2025 7:06 AM | Updated on Oct 22 2025 7:06 AM

రెడ్‌

రెడ్‌ అలర్ట్‌

బంగాళాఖాతంలో వాయుగండం ఉత్తర తమిళనాడు వైపుగా ప్రయాణం

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు చైన్నెలోనూ వాన జోరు 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో 4 జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌

రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు తీవ్రరూపం దాల్చాయి. పలుజిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడడం, ఇది వాయుగుండంగా మారనుండడంతో వానలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో మొత్తం 19 జిల్లాలపై వరుణుడి ప్రభావం ఉండగా.. వాటిలో నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, నాలుగు జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ను వాతవరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

సాక్షి,చైన్నె: ఈశాన్య రుతు పవనాలు ఈనెల 16వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. పశ్చిమ కనుల వెంబడి జిల్లాలో వర్షాలు విస్తృతంగా కురుస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితులలో అరేబియా సముద్రంలో అల్పపీనడం రూపంలో పశ్చిమ కనులమల వెంబడి ఉన్న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని , నీలగిరి తదితర జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల అటవీ ప్రాంతాలలో భారీగా వర్షం పడుతూ వస్తోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుండడంతో పశ్చిమ కనుమలలో వర్షం మరింత తీవ్రరూపం దాల్చనుంది. అదే సమయంలో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు వైపుగా కదుతోంది. ఈ ప్రభావంతో రామనాథపురం, పుదుకోట్టై, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్‌, తంజావూరు, కడలూరు, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరి, కారైకాల్‌లలో కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్‌, మదురై, తేని, దిండుగల్‌ జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

అధికారులతో సీఎం సమీక్ష

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్‌ , తంజావూరు డెల్టా జిల్లాలలో భారీ వర్షాలకు ఇప్పటి వరకు కలిగిన నష్టాన్ని, వర్షం తీవ్ర తరం కానున్న సమయంలో చేపట్టిన ముందస్తు చర్యలను సీఎం ఎం.కె. స్టాలిన్‌ సచివాలయం నుంచి సమీక్షించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తోపాటూ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. సముద్ర తీరం, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి తీసుకున్న చర్యలు, సహాయక చర్యలను గురించి తెలుసుకున్నారు. ఈ జిల్లాల్లో సగటున 56.61 మి.మీ వర్షపాతం నమోదైనట్టు ఈ సమావేశంలో తేల్చారు. శిబిరాలలో ప్రజలకు ఆహారం, తాగునీరు , వైద్య తదితర అన్ని సౌకర్యాలను గురించి వివరాలు ఆరాతీశారు. తిరువళ్లూరు, చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్‌ . తంజావూరు డెల్టా జిల్లాలలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఏదేని విపత్తులు ఎదురైన పక్షంలో తక్షణ విద్యుత్‌సహాయక చర్యల నిమిత్తం 51,639 విద్యుత్‌ స్తంభాలు, 1849 ట్రాన్స్‌ఫార్మర్లు , 1,187 విద్యుత్‌ కండక్టర్లు వంటి అవసరమైన అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నాయని ఈసందర్భంగా అధికారులు వివరించారు. వరి సేకరణ, నిల్వ, తరలింపు , మిల్లింగ్‌ను కూడా పరిశీలించారు. రైతులకు నష్టం, కష్టం అన్నది ఎదురు కాకుండా ముందస్తు చర్యలను విస్తృతం చ ఏయాలని సీఎం ఆదేశించారు. ఇక, చైన్నె మెట్రోపాలిటన్‌ నగరానికి సంబంధించి, గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ ద్వారా మోటార్‌ పంపులు, యంత్రాలను ఉపయోగించి లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపు నీటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్‌ స్తంభాలను మరమ్మతు చేయడానికి, సజావుగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ కంట్రోల్‌ రూమ్‌లో వర్షం గురించి వచ్చిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి, సీఎస్‌ మురుగానందం, రెవెన్యూ కార్యదర్శి సాయికుమార్‌, ప్రత్యేకపథకాలు అమలు విభాగం అదనపు కార్యదర్శి ప్రదీప్‌ యాదవ్‌, తమిళనాడు విద్యుత్‌ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ జె. రాధాకృష్ణన్‌, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పి. అముద, కమిషనర్‌ సి. జి. థామస్‌ వైద్యన్‌, గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ జె. కుమారగురుబరన్‌, జలవనరుల శాఖ కార్యదర్శి జె. జయకాంతన్‌, మైనర్‌ పోర్టుల శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌. సెల్వరాజ్‌, తమిళనాడు వినియోగదారులు పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ. అన్నాదురై, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం 12 మంది ఐఎఎస్‌ అధికారులతో ప్రత్యేక బృందాన్ని సీఎం స్టాలిన్‌ రంగంలోకి దించారు. వర్షాలు, వరదలు, విపత్తులు ఎదుర్కొనే దిశగా ఈబృందాలు జిల్లాలలోని అధికార యంత్రాంగాలను అలర్ట్‌ చేస్తూ ముందుకెళ్లనున్నాయి.

మేట్టూరు జలాశయం నుంచి నీటి విడుదల

చైన్నెలో వర్షంపాట్లు

ఉబరి నీటి విడుదల

వర్షాల నేపథ్యంలో చైన్నె, శివారు జిల్లాలో నిండు కుండులుగా ఉన్న చెరువులు, రిజర్వాయర్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. ముందు జాగ్రత్తగా నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. చెంబరంబాక్కం రిజర్వాయర్‌ నుంచి సెకనుకు వంద క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయపురం చెరువు నుంచి సైతం నీటిని విడుదల చేస్తున్నారు. పళ్లికరణై, వేళచ్చేరి పరిసరాలలో ఉన్న చెరువులకు నీటి రాకను పరిశీలిస్తూ వస్తున్నారు. అడయార్‌ నది తీరం వెంబడి ఉన్న చెరువులపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా, ఆ తీరవాసులను అప్రమత్తం చేశారు. ఇక మేట్టూరు జలాశయం నుంచి ఉబరి నీటిని విడుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. వాగులు వంకలు అనేక జిల్లాలో పొంగిపొర్లుతుండడంతో రిజర్వాయర్‌లు, జలాశయాలలోకి వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవి నిండగానే ఉబరి నీటి విడుదలకు సిద్ధమయ్యారు.

బుధ, గురువారాలలో విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, రామనాథపురం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇక చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే మరో 11 జిల్లాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇక, చైన్నె, శివారు జిల్లాలలో మంగళవారం ఉదయం నుంచి వాన కురుస్తోంది. ఈ వర్షాలు మూడురోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షం మరింత తీవ్రతరం కానుండడంతో చైన్నె కార్పొరేషన్‌ యంత్రాంగం అలర్ట్‌ అయ్యింది. చైన్నెలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శిబిరాలను సిద్ధం చేశారు. ఏదేని విపత్తు ఎదురైనపక్షంలో లోతట్టు ప్రాంత వాసులను శిబిరాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈశిబిరాలలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇదిలా ఉండగా వాయుగుండం తుపాన్‌గా మారేనా లేదా? అన్నది బుధవారం తేలుతుందని వాతావరణ కేంద్రం అధికారి అముధ తెలిపారు.

రెడ్‌ అలర్ట్‌ 1
1/5

రెడ్‌ అలర్ట్‌

రెడ్‌ అలర్ట్‌ 2
2/5

రెడ్‌ అలర్ట్‌

రెడ్‌ అలర్ట్‌ 3
3/5

రెడ్‌ అలర్ట్‌

రెడ్‌ అలర్ట్‌ 4
4/5

రెడ్‌ అలర్ట్‌

రెడ్‌ అలర్ట్‌ 5
5/5

రెడ్‌ అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement