
తాగునీటి కోసం రాస్తారోకో
తిరుత్తణి: తాగునీటి కోసం గ్రామీణులు దీపావళి రోజు జాతీయ రహదారిలో రాస్తారోకో ఘటనకు సంబంధించి న్యాయవాదిపై సీఐ దాడి చేసిన ఘటన వివాదస్పదంగా మారింది. తిరుత్తణి యూనియన్‌లోని మురుక్కంపట్టు గ్రామ పంచాయతీలో ఎగువ మురుక్కంపట్టులో 200కు పైగా కుటుంబాలు నివాశముంటున్నాయి. పంచాయతీ ద్వారా గ్రామీణులకు పైప్‌లైన్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో వారం రోజుల నుంచి గ్రామంలో తాగునీటి సరఫరా ఆగడంతో గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీపావళి సందర్భంగా మంగళవారం గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో మురుక్కంపట్టు వద్ద జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో తిరుత్తణి సీఐ మదియరసన్ సిబ్బందితో వచ్చి రాస్తారోకో విరమించాలని కోరారు. ఈ సందర్భంగా ఆందోళనలో ఆ గ్రామానికి చెందిన అయ్యప్పన్ అనే న్యాయవాదిపై పోలీసులు చెయ్యి వేసుకోవడంతో గ్రామీణులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. దీంతో న్యాయవాదిని పోలీసులు విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. బీడీఓ ఆదేశాల మేరకు గంట వ్యవధిలో తాగునీటిని గ్రామీణులకు సరఫరా చేశారు.

తాగునీటి కోసం రాస్తారోకో