
అమర వీరులకు ఘన నివాళి
వేలూరు: దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమర వీరులకు వేలూరు పోలీస్ గ్రౌండ్‌లో ఎస్పీ మయిల్‌వాగణన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 653 మంది పోలీసులు వీరమరణం పొందారు. వీరికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రతి ఏడా ది అక్టోబర్ 21న పోలీసులు వీర వందనం చేయ డం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవా రం ఉదయం వేలూరులోని పోలీస్ గ్రౌండ్‌లో అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ ప్రభు త్వ లాంచనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ దేశ రక్షణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ పయణి, అమరవీరులకు నివాళులర్పించారు. అదేవిధంగా తిరుపత్తూ రు, రాణిపేట జిల్లాల్లోను ఆయా ఎస్పీలు నివాళులర్పించారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: భారత సరిఽహద్దులో విధులు నిర్వహిస్తూ అమరులైన జవాన్లకు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, ఆవడి కమిషనర్ శంకర్ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆవడి కమిషనర్ కార్యాలయం, తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలోనూ ప్రత్యేక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమానికి ఎస్పీ వివేకానంద శుక్లా నేతృత్వంలో నివాళులర్పించారు. ఆవడిలో కమిషనర్ శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

అమర వీరులకు ఘన నివాళి