
వైభవంగా దీపావళి ఆస్థానం
గోవిందరాజప్వామి ఆలయంలో ఆస్థానం
శ్రీకోదండరామస్వామి ఆలయంలో..
తిరుపతి కల్చరల్ : నగరంలోని పలు ఆలయాల్లో సోమవారం వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. అందులో భాగంగా శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం ప్రాంగణంలోని శ్రీపుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం జరిపించారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ ఏఈఓ ఏబీఎన్ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి పాల్గొన్నారు. అలాగే శ్రీకోదండరామాలయంలో సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు దీపావళి ఆస్థానం ఘనంగా చేపట్టారు. ఈ సందర్బంగా శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలను కోదండరామునికి సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ , అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా దీపావళి ఆస్థానం