
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పళ్లిపట్టు: లవ నదీ ప్రవాహంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం గ్రామానికి చెందిన గోవిందరాజ్(56). ఇతను కుమారాజుపేటలో బార్బర్ దుకాణం నిర్వహించేవారు. గత కొద్ది రోజులుగా పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో కొండల నుంచి వరద నీరు లవ, కుశ నదుల్లో ప్రవహించి కుశస్థలిలో కలిసి వరద చోటుచేసుకుంటోంది. ఈక్రమంలో సోమవారం గోవిందరాజ్ దుకాణం మూసి మద్యం మత్తులో ఇంటికి నడిచివెళ్లాడు. మార్గమధ్యలోని లవ నదిలో వరద ప్రవాహంలో నడిచి వెళుతుండగా కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. మంగళవారం ఉదయం లవ నది తీరంలో గోవిందరాజ్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.