
● ఫ్యాషన్ అదుర్స్
దీపావళి పండుగను పురస్కరించుకుని ఫీనిక్స్ మార్కెట్ సిటీలో 90 డేస్ ఆఫ్ ఫన్ వేడుకలలో భాగంగా జరిగిన ఫ్యాషన్ షో చైన్నెకు కొత్త వన్నె తెచ్చినట్టుగా జరిగింది. యుఫోరియా – ఏ సెలబ్రేషన్ ఆఫ్ స్టార్స్ పేరిట జరిగిన షోలో ప్రఖ్యాత ఫ్యాషన్ మాస్ట్రో ప్రసాద్ నేతృత్వంలో అందాల తారలు, మోడల్స్ వివిధ వస్త్రాలను పరిచయం చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. యు ఫోరియా ఫ్యాషన్, సంస్కృతి, వినోదాన్ని అందంగా విలీనం చేసే ఒక ఐకానిక్ వేడుకగా నిర్వహించామని ఫీనిక్స్ డైరెక్టర్ రీతు జై మెహత తెలిపారు.
– సాక్షి, చైన్నె