
డీఎంకే పాలనకు కౌంట్‌డౌన్ ఆరంభం
సాక్షి, చైన్నె: తమిళనాడులో డీఎంకే పాలనకు కౌంట్‌డౌన్ ఈ రోజు నుంచే ప్రారంభమైందని బీజేపీ, అన్నాడీఎంకే మిత్రపక్ష పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఓ వైపు పళణి స్వామి ప్రజా చైతన్య యాత్రకు వస్తున్న విశేష స్పందనను గుర్తుచేస్తూ, దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా నైనార్ యాత్రకు శ్రీకారం చుట్టడాన్ని ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలను గురి పెట్టి ప్రచార ప్రయాణానికి సిద్ధమైన విషయం తెలిసిందే. మదురై వేదికగా ఆదివారం జరిగిన బహిరంగ సభతో తన ప్రచారాన్ని ఆయన శ్రీకారంచుట్టారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార రథం సిద్ధం చేశారు. ఆయన పలు నియోజకవర్గాలలోపర్యటించే విధంగా ఇప్పటికే రూట్‌మ్యాప్ విడుదల చేశారు.ఈ పరిస్థితులో మదురై వేదికగా జరిగిన బహిరంగ సభకు అన్నాడీఎంకే తరపున ఆర్‌బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, రాజన్ చెల్లప్పలు హాజరై నైనార్ యాత్రకు తమ మద్దతును తెలియజేశారు.
పళణి సీఎం కావడం తథ్యమని వ్యాఖ్య
ఓ వైపు తమ నేత పళణి స్వామి ప్రజా చైతన్య యాత్రతో దూసుకెళ్తున్నారని వివరిస్తూ, 2026 ఎన్నికలలో గెలుపుతో పళణి స్వామి సీఎం కావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కూటమికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా నైనార్ నాగేంద్రన్ పర్యటన చేయడం ఆహ్వానిస్తున్నామని, మద్దతు తెలియజేస్తున్నామని, ఈ పర్యటన కూడా బ్రహ్మాండ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. పళణి స్వామి సీఎం కావడం తథ్యమని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తంచేశారు. ఇక ఈ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్, కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, మాజీ ఎమ్మెల్యే విజయధరణి, సీనియర్ నేతలు పొన్ రాధాకృష్ణన్, హెచ్ రాజలతోపాటూ కూటమికి చెందిన పుదియ నిదికట్చి నేత ఏసీ షణ్ముగం, తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్ తదితర పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా నినదించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమికి శాశ్వత విశ్రాంతిని ఇద్దామని పిలుపునిస్తూ ప్రతిజ్ఞ చేశారు. డీఎంకే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ఈ రోజు నుంచే మొదలైందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ యాత్రంలో కేడర్‌కు ఉత్సాహాన్ని నింపే విధంగా పాటలను విడుదల చేశారు. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగందివంగత ముఖ్యమంత్రి జే జయలలిత నైనార్ నాగేంద్రన్‌ను అభినందిస్తూ గతంలోచేసిన వ్యాఖ్యలు, దివంగత నేత ఎంజీఆర్ ఆశయాలను వివరించడం గమనార్హం. అలాగే, డీఎంకే వైఫల్యాలు, అవినీతి అక్రమాలను వివరించే విధంగా సీఎం స్టాలిన్, ఆయన తనయుడు , డిప్యూటీ సీఎం ఉదయ నిధిని వ్యాంగ్యాస్త్రాలతో చిత్రీకరిస్తూ లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు.

డీఎంకే పాలనకు కౌంట్‌డౌన్ ఆరంభం

డీఎంకే పాలనకు కౌంట్‌డౌన్ ఆరంభం