
ఈశాన్యంలో.. తుపానుల గండం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల రూపంలో వరుసగా తుపాన్‌ల గండం ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ సారి రెండు లేదా మూడు తుపానులు పుదుచ్చేరి తీరా న్ని తాకే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఆదివారం కూడా అనేక జిల్లా లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతీ సీజన్ ముగిసింది. వివరాలు.. ఈశాన్య రుతు పవనాలు ఈనెల 16 లేదా 18 తేదీలలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర తమిళనాడుతో పాటు గాపుదుచ్చేరిలో ఈశాన్య రుతు పవనాల ప్రభావం అధికంగా ఉంంటాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో ఆశాజనకంగానే ఉంటాయి. ఈ పరిస్థితులలో పుదుచ్చేరి, తమిళనాడులోని కడలూరు మధ్య సాధారణంగా ఏటా ఏదో ఓ తుపాన్ తీరం దాటడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా రెండు మూడు తుపాన్‌లను ఈ తీర వాసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై వాతావరణ పరిశోధకుడు బాల మురుగన్ పేర్కొంటూ, ఈశాన్య రుతు పవనాల రూపంలో ఈనెలాఖరులో పుదుచ్చేరిలో అధికంగా వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావం ఎలాగో ఉత్తర తమిళనాడులోని చైన్నె నుంచి విల్లుపురం, కడలూరు వరకు పడే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో రెండు లేదా మూడు తుపాన్‌లు ఈ పవనాల రూపంలో బ యలు దేరేందుకు వీలుందని, ఇవి పుదుచ్చేరి తీరాన్ని తాకేందుకు అఽధిక అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక వేళ పుదుచ్చేరి తీరం నుంచి దిశ మారిన పక్షంలో ఈ తుఫాన్‌లు అటు కడలూరు లేదా, ఇటు మహాబలిపురం –మరక్కాణం లేదా చైన్నె మీంజూరు సమీపంలో తీరం దాటేందుకు వీలుంది. ఇందుకు కారణం గతంలో బయలుదేరిన తుపాన్‌లు ఈ తీరాలను తాకి ఉండటం గమనార్హం. తుఫాన్‌లు బయలు దేరే అవకాశాల నేపథ్యంలో చైన్నె, శివారులపై మరింతగా ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.