
నిండు కుండలా..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో హొగ్నెకల్ వద్ద కావేరి నదిలో నీటి ఉధృతి కొనసాగుతోంది. మేట్టూరు జలాశయంలోకి సెకనుకు 60 వేల క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒకే రోజులు నీటి మట్టం మూడు అడుగులు పెరిగింది. 120 అడుగులతో కూడిన ఈజలాశయం నీటి మట్టం ప్రస్తుతం 116 అడుగులకు చేరింది. నిండు కుండగా ఒకటి రెండురోజులలో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కావేరి తీరంలో ముందస్తు అప్రమత్త హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వారం రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఉబరి నీటిని విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కృష్ణగిరిలోని కెలవర పల్లి రిజర్వాయర్ నిండడంతో సెకనుకు 6 వేల క్యూ సెక్కుల నీటిని తెన్ పైన్నె నదిలోకి విడుదల చేశారు. అలాగే తిరువణ్ణామలై సాత్తనూరు డ్యాం నిండడంతో సెకనకు 6 వేల క్యూసెక్కుల నీటిని తెన్ పైన్నెలోకి విడుదల చేశారు. తెన్ పైన్నె నదిలోకి నీటి ఉధృతి పెరగడంతో కళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. భవానీసాగర్ నీటిమట్టం 98 అడుగులకు చేరింది. ముందు జాగ్రత్తగా డ్యాం నుంచి సెకనుకు 2 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.