
రూ.200 కోట్లతో పదకొండు బస్టాండ్లు
తిరువళ్లూరు: చైన్నె మెట్రో డెవలప్‌మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలో పాడియనల్లూరు సహా 11ప్రాంతాల్లో రూ.200 కోట్లతో నూతన బస్టాండ్లను నిర్మించనున్నట్టు మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. పాడియనల్లూరులో నూతన బస్టాండుకు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు మంగళవారం ఉదయం భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ తిరువికేనగర్, అంబత్తూరు, తిరువాన్మిమయూర్, ఆవడి, వల్లలార్‌నగర్ సహా 11 ప్రాంతాల్లో రూ.200 కోట్లతో కొత్త బస్టాంఉ్ల నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరువికే నగర్, పెరియార్‌నగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా గత ఆగస్టులో నిర్మాణ పనులకు భూమిపూజ చేశామన్నారు. తండయార్‌పేట, ములైనగర్, కన్నదాసన్‌నగర్, అంబత్తూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బస్టాండు పనులు పూర్తయిన క్రమంలో త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తిరువాన్మియూర్, ఆవడి, అయ్యప్పన్‌తాంగెళ్ బస్టాండు నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నందన్న మంత్రి, త్వరలోనే మిగిలిన ప్రాంతాల్లోనూ పనులను ప్రారంబిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రకాష్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే సుదర్శనం పాల్గొన్నారు.