
పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత
తమిళసినిమా: పా.రంజిత్ దర్శకత్వం వహించి, తన నీలం ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. నటుడు గెత్తు దినేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటుడు ఆర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈయనది ప్రతినాయకుడు పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇది మోడ్రన్ గ్యాంగ్ స్టర్ కథా చిత్రం అని సమాధానం. ఇందులో నటుడు మణికంఠన్ మరో కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని సమాచారం. ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరన్నది యూనిట్ వర్గాలు వెల్లడించకుండా సస్పెనన్స్ కొనసాగిస్తూ వచ్చారు. కాగా తాజాగా ఈ క్రేజీ చిత్రంలో టాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ శోభిత ధూళిపాళ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు పొన్నియిన్ సెల్వం చిత్రంలో కీలక పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారన్నది గమనార్హం. అంతే కాకుండా అదే ఈమెకు కోలీవుడ్లో తొలి చిత్రం. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటి శోభిత ధూళిపాళ నటిస్తున్నట్లు సమాచారం. కాగా దళిత సామాజిక వర్గాల సమస్యలు ఇతివృత్తంతో చిత్రాలు చేసే పా.రంజిత్ గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో చిత్రం చేయడం, అందులో నటి శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించడం వంటి సంఘటనలతో వెట్టువన్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
శోభిత ధూళిపాళ