
సూర్య మరో నిర్మాణ సంస్థ?
తమిళసినిమా: కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న నటుడు సూర్య. ఇంతకుముందే బాలీవుడ్‌కు పరిచయమైన ఈయన పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి తన పిల్లల పేరుతో 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇక తన బంధువుల చిత్ర నిర్మాణ సంస్థల్లోనూ చిత్రాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.ఈయన నగరం స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.