
అనుమతించిన ప్రాంతాల్లోనే ధర్నాలు చేయాలి
తిరుత్తణి: అనుమతించిన ప్రాంతాల్లో మాత్రమే రాజకీయ పార్టీలు ప్రచారాలు, ధర్నాలు చేపట్టాలని ఆర్డీఓ కణిమొళి సూచించారు. తిరుత్తణిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో బుధవారం రాజకీయ పార్టీల శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బహిరంగ సభలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించిన స్థలాలు మాత్రమే ఎంపిక చేసి నిర్వహించాలని, తిరుత్తణి సబ్ డివిజన్‌లోలోని ప్రధాన ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్థలాల్లో కార్యక్రమాలు నిర్వహణకు సంబందించి ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి పొంది కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, వీసీకే, ఏఎంఎంకే, టీవీకే. టీఎంసీ సహా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.