
ప్రజాక్షేత్రంలోకి.. రామన్న
సాక్షి, చైన్నె: అన్బుమణికి చెక్ పేట్ట విధంగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తన సామాజిక వర్గం ప్రజలలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ మొదటి వారంలో ధర్మపురి నుంచి పర్యటన చేపట్టనున్నారు. వివరాలు.. వన్నియర్‌సామాజిక వర్గంతో నిండిన పార్టీ పీఎంకే అన్న విషయం తెలిసిందే. అయితే, ఈ పార్టీలో ప్రస్తుతం తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య వార్ బయలు దేరడంతో కేడర్ రెండుగా విడి పోయి ఉన్నారు. అన్బుమణిని పార్టీ నుంచి సైతం రాందాసు తొలగించడంతో ఆయన మద్దతు అభిమాన లోకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరువురి మద్దతు దారుల మధ్య పెద్ద సమరమే బయలు దేరింది. అదే సమయంలో ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీ, చిహ్నంతనదే అని చాటుకునే పనిలో అన్బుమణి నిమ్నగమయ్యారు. ఇందుకు చెక్ పెట్టే విధంగా ఢిల్లీకి తన ప్రతినిధులను రాందాసు పంపించారు. వీరు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను బుధవారం సంప్రదించారు. పార్టీకి సంబంధించి అన్ని అధికారులు రాందాసుకే ఉన్నట్టుగా వివరిస్తూ సమగ్ర సమాచారాలు, నివేదికలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. అదే సమయంలో అన్బుమణి రూపంలో ఎదురైన పరిణామాలతో కేడర్ అంతా తన వెన్నంటే ఉన్నారనిచాటుకునే విధంగా రాందాసు వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా ఆయన తన సామాజిక వర్గం ప్రజల్ని కలిసే విధంగా గ్రామాల బాటకు నిర్ణయించి ఉన్నారు. వన్నియర్ సామాజిక వర్గం అత్యధికంగా ఉత్తర తమిళనాడులలో ఏఏ గ్రామాలలో ఉన్నాయో అన్న వివరాలను ఇప్పటికే సేకరించారు. తన వర్గాన్ని స్వయంగా కలిసి అన్బుమణి రూపంలో ఎదురైన పరిణామాలను వివరించే దిశగా రాందాసు అడుగులు వేయడానికి నిర్ణయించారు. ఈమేరకు వన్నియర్ సంఘం సమావేశంలో తీర్మానించారు. ధర్మపురి నుంచి అక్టోబరు మొదటి వారంలో ఈ పర్యటన మొదలు కానుంది. ఉత్తర తమిళనాడులోని జిల్లాలోని గ్రామాలను ఎంపిక చేసుకుని రోజుకో గ్రామానికి వెళ్లిన తన ఆప్తులకు అన్బుమణిని దూరం చేసే విధంగా రాందాసు వ్యూహాలకు పదును పెట్టి ఉండడం గమనార్హం. కాంచీపురం, కడలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కళ్లకురిచ్చి , కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాందాసు వ్యూహాలకు పదును పెట్టేందుకు సన్నం అవుతున్నట్టు ఆయన మద్దతు నేత ఒకరు పేర్కొన్నారు.
రాందాసు