6న చైన్నెకి జేపీ నడ్డా | - | Sakshi
Sakshi News home page

6న చైన్నెకి జేపీ నడ్డా

Sep 25 2025 7:29 AM | Updated on Sep 25 2025 7:29 AM

6న చై

6న చైన్నెకి జేపీ నడ్డా

సాక్షి, చైన్నె: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అక్టోబ రు 6వ తేదీన చైన్నెకు రాను న్నారు. ఈ వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ బుధవారం ప్రకటించా రు. తమిళనాడులో అన్నా డీఎంకే నేతృత్వంలోని కూ టమిలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమిగా ప్రయాణిస్తున్న కమలనాథులు, తమ కూటమి బలాన్ని పెంచే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వివరిస్తున్నారు. వారి ఆదేశాలు, వ్యూహాలకు అనుగుణంగా నైనార్‌ ముందుకు సాగుతూ వస్తున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన నైనార్‌ నాగేంద్రన్‌ అక్కడి నేతలతో భేటీ అనంతరం చైన్నెకు బుధవారం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ జా తీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్టోబరు 6వ తేదిన చైన్నె రానున్నారని వివరించారు. చైన్నెలో జరిగే ఓ కళాశాల స్నాతకోత్సవంలో సైతం పాల్గొననున్నారని పేర్కొన్నా రు. అనంతరం ఇక్కడి నేతలతో సమావేశం, ఆ తర్వా త పుదుచ్చేరిలో పర్యటిస్తారని వివరించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌లకు భేటి గురించి ప్రశ్నించగా, ఇది స్నేహపూర్వక సమావేశం అని సమాధానం ఇచ్చారు. అక్టోబరు 12వ తేదీ నుంచి మదురైలో బీజేపీ ఎన్నికలప్రచారం ప్రారంభం అవుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.

చెట్టు పడి కారు ధ్వంసం

తిరువొత్తియూరు: చెట్టు పడి కారు ధ్వంసమైన ఘ టన చైన్నెలో చోటుచేసుకుంది. చైన్నెలోని కీల్పా క్కం ప్రాంతానికి చెందిన సీత (32) అన్నానగర్‌ లోని ఐఏఎస్‌ అకాడమీలో చదువుతుంది. మంగళవారం ఆమె అన్నానగర్‌ 6వ అవెన్యూలో రోడ్డు పక్కన కారు పార్క్‌ చేసి చదువుకోవడానికి వెళ్లింది. ఆసమయంలో అకస్మాత్తుగా చెట్టు కారుపై ప డింది. వెంటనే అన్నానగర్‌ 8వ జోన్‌ కార్పొరేషన్‌ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కార్మికుల సాయంతో కారుపై పడిన చెట్టును తొలగించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లలకు కాలేయ మార్పిడి

సాక్షి, చైన్నె: చైన్నెలోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో 8 సంవత్సరాల బాలుడితో పాటు ఏడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరు శిశువులకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఈ వివరాలను బుధవారం ప్రకటించారు. ఈ ప్రక్రియను మల్టీ డిసిప్లినరీ బృందం విజయవంతంగా నిర్వహించినట్టు ఆస్పత్రి లీడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సోమశేఖర్‌ ప్రకటించారు. తూత్తుకుడికి చెందిన 8 సంవత్సరాల బాలుడికి కాలేయ మార్పిడి అనివార్యం కావడంతో ఆధునిక విధానంతో శ్రస్త చికిత్స చేశామన్నారు. బాలుడి తల్లి కాలేయంలో కొంత భాగం అవయవదానం ద్వారా సేకరించామన్నారు. అలాగే, మరో ఇద్దరు పాండిచ్చేరికి చెందిన నెల వయస్సు ఉన్న పాప, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఐదు నెలల చిన్నారికి కాలేయ వ్యాధి కారణంగా అవయవ మార్పిడి తప్పనిసరిగా మారిందన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో ఈ శస్త్ర చికిత్సలు విజయవంతమైనట్టు వివరించారు. డాక్టర్లు, ప్రసన్న గోపాల్‌, కార్తీక్‌ నారాయణన్‌, నటరాజ్‌ పళణియప్పన్‌, కీర్తి వాసన్‌, సతీష్‌చందర్‌ పాల్గొన్నారు.

6న చైన్నెకి జేపీ నడ్డా 
1
1/1

6న చైన్నెకి జేపీ నడ్డా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement