
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్మోనాలజీ ప్రారంభం
కొరుక్కుపేట: చైన్నె తేనాంపేటలోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో శ్వాసకోశ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్మోనాలజీని ప్రారంభించారు. ఉబ్బసం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, పొగాకు వాడకం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించేందుకు,అదే విధంగా నగరంలో వాయు కాలుష్యం వల్ల బాధపడేవారికి ఈ కేంద్రంలో తగు చికిత్స లభిస్తుందని ఆ ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరన్ పూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రాజగోపాల తదితరులు పాల్గొన్నారు.