
వేలూరులో ఆక్రమణలు తొలగించండి
వేలూరు: వేలూరు మండీ వీధిలోని ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అఽధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా వేలూరులో కురిసిన వర్షాలకు బురదమయమైన రోడ్డు, మార్కెట్ వాటిని ఆమె గురువారం ఉదయం తనిఖీ చేశారు. అనంతరం వేలూరు మండీ వీధిలోని ఆక్రమణలను తనఖీ చేశారు. తరచూ మండీ వీధిలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇందుకు దుకాణదారులు రోడ్డును ఆక్రమించుకోవడంతో పాటు రోడ్డు మధ్యలో గోడను ఏర్పాటు చేయడమే అన్నారు. మధ్యలో ఉన్న గోడను తొలగించడంతోపాటు ఆక్రమణలు లేకుండా చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదన్నారు. అనంతరం ఓటేరిలో జరుగుతున్న మీతో స్టాలిన్ పథకాన్ని తనిఖీ చేసి అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే సంక్షేమ పథకాలను అందజేశారు. ఎమ్మెల్యే నందకుమార్, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, కార్పొరేటర్లు ఆండాల్, బాబి, అధికారులు పాల్గొన్నారు.