
1,140 కిలోల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
సేలం: తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఈరోడ్ జిల్లాలో నిరోధించడానికి కార్పొరేషన్ అధికారులు రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈస్థితిలో ఈరోడ్ కందసామి వీధిలోని ఒక ప్లాస్టిక్ దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను ఒక గోడౌన్‌లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందింది. హెల్త్ ఇన్‌స్పెక్టర్ భూపాలన్ నేతృత్వంలో కార్పొరేషన్ అధికారులు సంఘటన స్థలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులు 1,140 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని, యజమానులు రాహుల్, ప్రవీణ్ కుమార్‌లకు రూ.25వేల జరిమానా విధించారు.