
21 కిలోల గంజాయి స్వాధీనం
– ముగ్గురు ఒడిశా యువకులు అరెస్టు
తిరువళ్లూరు: పూందమల్లి సమీపంలో గంజాయి విక్రయించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలో అక్రమంగా గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఎకై ్సజ్ ఇన్స్‌స్పెక్టర్ సుభాషిణి, ఎస్‌ఐ నాట్టామై పూందమల్లిలోని బస్టాండు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పట్టుబడిన యువకులు ఒడిశాకు చెందిన షిఫాబెక్రా(31), రామగండా మజ్కీ(32), ఆలేఖాపున్‌జీ(26)గా గుర్తించారు. వీరు ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు నిర్ధారించి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.