
రోడ్డు భద్రతపై అవగాహన
తిరువళ్లూరు: రోడ్డు భద్రతపై యువతకు మరింత అవగాహన అవసరమని సినీనటుడు ఎమ్‌ఎస్. భా స్కర్ సూచించారు. ప్రమాదాలు లేని సమాజాన్ని రూపొందించడం, రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో గమనించు.. ప్రయాణించు పేరుతో ప్రత్యేక పాట, షార్ట్ ఫిల్మ్‌ను నటుడు ఎమ్‌ఎస్ భాస్కర్ రూపొందించారు. సంబంధిత పాటను విడుదల చేసే కార్యక్రమం తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. కార్యక్రమానికి ఆవడి కమిషనర్ శంకర్, అడిషనల్ కమిషనర్ భవానీశ్వరీ హాజరయ్యారు. నటుడు ఎమ్మెస్ భాస్కర్, జ్ఞానసంబంధం హాజరై సీడీని విడుదల చేశారు. అనంతరం రోడ్డు భద్రత, ప్రమాదాలు లేని ప్రయాణంపై విద్యార్థులకు నిర్వహించిన వేర్వేరు వ్యాస, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, ప్రమాదాలు లేని సమాజ నిర్మాణాన్ని రూపొందించడంపై రీల్స్ చేసి avadactraffic panninf@fmai.com పంపాలని కోరారు. ఎంపిక చేసిన రీల్స్‌కు మొదటి బహుమతి కింద రూ. 20వేలు, రెండవ బహుమతి కింద రూ.15వేలు, మూడవ బహుమతిగా రూ.10వేలతోపాటు మరో 20 రీల్స్‌కు వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తామన్నారు.