
ఆలయంలో చోరీ
– ముగ్గురి అరెస్టు
తిరువొత్తియూరు: రెడ్ హిల్స్ సమీపంలోని పాడియనల్లూరు, సెంగూండ్రం వెళ్లే దారిలో బస్ స్టాప్ వెనుక శ్రీ భూమి నీలా సమేత శ్రీనివాస పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఈనెల11న భక్తులు పూజలు చేయడానికి వచ్చినప్పుడు, ఆలయం వెలుపలి భాగంలో ఉన్న హుండీ పగలగొట్టి గర్భగుడిలో ఉన్న విగ్రహానికి అలంకరించిన బంగారు చైన్, వెండి దీపాలు, సుమారు 3 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిసింది. దీనిపై ఆలయ నిర్వాహకుల తరపున రెడ్ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాలను పరిశీలించగా, చైన్నె పెరంబూరులోని భారత్ రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన శివకుమార్ (17), చైన్నె కొళత్తూరు తిల్లా నగర్ ప్రధాన రహదారికి చెందిన జయప్రతాప్ (19), కల్లకురిచ్చి జిల్లా తిరుకోవిలూర్ తాలూకా తగడి మేట్టు వీధికి చెందిన హరికృష్ణన్ (23)ను నిందితులుగా గుర్తించారు. రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్ క్రైమ్ విభాగం ఇనన్‌స్పెక్టర్ లతా మహేశ్వరి ముగ్గురిని అరెస్టు చేసి పొన్నేరి కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు పంపారు.
చైన్నె–నెల్లాయ్ వందే
భారత్‌కు అదనపు కోచ్‌లు
కొరుక్కుపేట: చైన్నె ఎగ్మోర్ –తిరునెల్వేల్లి మధ్య వందే భారత్ రైలును గతంలో 8 కోచ్‌లతో నడిపారు. తరువాత, ప్రయాణీకుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మరో 8 కోచ్‌లను అదనంగా చేర్చారు. ఈ పరిస్థితిలో, చైన్నె–నెల్లాయ్ వందే భారత్ రైలులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున, కోచ్‌ల సంఖ్యను మరింతగా పెంచాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా, చైన్నె–నెల్లాయ్ వందే భారత్ రైలులో కోచ్‌ల సంఖ్యను 24వ తేదీ నుంచి పెంచనున్నారు. అదనంగా 4 కోచ్‌లను చేర్చి వందే భారత్ రైలును 20 కోచ్‌లతో నడపనున్నారు. వందే భారత్ రైలులో ఇప్పటికే 1,128 సీట్లు ఉన్నాయి. 4 కోచ్‌ల అదనపు తర్వాత, అదనంగా 312 సీట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
వృద్ధుడిపై పోక్సో కేసు
తిరుత్తణి: బాలికకు లైంగిక వేధింపులకు గురిచేసిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద బుధవారం అరెస్టు చేశారు. ఆర్కే మండలానికి చెందిన 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని ఓ వృద్ధుడు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాలిక తల్లి తిరుత్తణి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ మలర్ విచారణలో తిరువణ్ణామలై జిల్లాకు చెందిన పెరుమాళ్(64)ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.