ఏదైనా కొంత కాలమే! | - | Sakshi
Sakshi News home page

ఏదైనా కొంత కాలమే!

Sep 18 2025 7:14 AM | Updated on Sep 18 2025 7:14 AM

ఏదైనా

ఏదైనా కొంత కాలమే!

తమిళసిని మా: ఇంతకు ముందు చాలా మంది రాజకీయ ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలు గా రూపొందాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్ర తెరకె క్కనుంది. మా వందే పేరుతో ఈ బయోపిక్‌ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని సిల్వర్‌ కాస్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై వీర్‌రెడ్డి నిర్మించనున్నారు. ఇందులో నరేంద్రమోదీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ నటించనున్నారు. బుధవారం ఈ చిత్రం గురించి ప్రకటించారు. కోట్లా ది ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ విత పయనాన్ని చిత్రీకరించే కథా చిత్రంగా ఇది ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ఆయన బాల్యం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు ఈ చిత్ర కథ సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి ఆయన మాతృమూర్తి హీరాబెన్‌ మోదీకి మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను గాంధీకుమార్‌ సీహెచ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి కేకే.సెంథిల్‌ ఛాయాగ్రహణం, రవిభాస్కర్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ నిర్వాహణ బాధ్యతలను గంగాధర్‌ ఎన్‌ఎస్‌, వాణీశ్రీ.బీ నిర్వహిస్తారని, లైన్‌ ప్రొడ్యూసర్‌గా నరసింహరావు వ్యవహరించనున్నారని చెప్పారు.కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

తెరపైకి మోదీ బయోపిక్‌

తమిళసినిమా: సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది కెరీర్‌కు బాగా ఎఫెక్ట్‌ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్‌ టైమ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్‌గానీ, గ్లామర్‌, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు. ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్‌ వస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు.

ఏదైనా కొంత కాలమే! 
1
1/2

ఏదైనా కొంత కాలమే!

ఏదైనా కొంత కాలమే! 
2
2/2

ఏదైనా కొంత కాలమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement