
స్వాతంత్య్రయోధుల వారసులకు ఇంటిపట్టాలివ్వాలి
వేలూరు: స్వాతంత్ర సమర యోధుల వారసులకు ఇంటి పట్టాలు ఇప్పించడంతో పాటూ విద్య, ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారసులు కలెక్టర్‌కు విన్నవించారు. బుధవారం ఉదయం వేలూరు కలెక్టరేట్‌లో జిల్లాలోని స్వాతంత్ర సమర యోధుల వారసులకు గ్రీవెన్‌సెల్ కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారసులు మాట్లాడుతూ ప్రభుత్వం వారసులందరికీ ఇంటి పట్టాలు ఇప్పించడంతో పాటూ ఉచిత రైలు పాసు, బస్సు పాసులను ఇప్పించాలని కోరారు. వీటిపై ప్రభుత్వానికి సిఫార్సు చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహించిన గ్రీవెన్‌సెల్‌లో మొత్తం 22 వనతులు వచ్చిందని వాటిలో 18 వినతలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన వాటిని విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇంటి పట్టాతో పాటూ పరిశ్రమలు స్థాపనకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం విన్న వించారని వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక తహశీల్దార్ కలయమూర్తి, జిల్లా ఆది ద్రావిడ సంక్షేమశాఖ అధికారి మదుసెరియన్, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జయచిత్ర, వారసులు పీపీ చంద్రప్రకాష్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.