
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
వేలూరు: వాచ్‌మన్ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని కారపట్టు గ్రామానికి చెందిన ఆస్కర్‌బాషా(38) ఇతను అదే గ్రామంలోని ప్రయివేటు వ్యవసాయ భూమికి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత వారం ఇతను వ్యవసాయ బావిలో మృతదేహంగా కనిపించడంతో ఉమరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్కర్‌బాషాతో పాటు అదేప్రాంతంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అక్కడ నుంచి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసుల అనుమానం మరింతగా పెరిగి వారి కోసం విచారణ చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో ఆ రారష్ట్‌రంలోని ప్రియాక్‌రాజ్ ప్రాంతంలో ఉన్న కూలీ అనిల్‌కుమార్, అదే ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆంబూరుకు తీసుకొచ్చి విచారణ చేశారు. విచారణలో కారపట్టు గ్రామంలో వ్యవసాయ భూమిలో పనిచేసేందుకు వచ్చామని ఆ సమయంలో ఆస్కర్‌బాషా తమను వేధింపులకు గురిచేసే వాడని దీంతో హత్య చేసిన రోజు తమ మధ్య ఘర్షణ ఏర్పడిందని తెలిసింది. దీంతో అతనిపై దాడి చేసిన సమయంలో ఆయన స్పృతప్పి పడిపోవడంతో అతన్ని బావిలో వేసి అక్కడ నుంచి బైకులో హొసూరుకు, ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి అనిల్‌కుమార్‌ను వేలూరు జైలుకు, చిన్నారిని బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు.