
సంగీతదర్శకుడు శంకర్‌గణేశ్‌కు అస్వస్థత
తమిళసినిమా: సీనియర్ సంగీత దర్శకుడు శంకర్ గణేశ్ (81) బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చైన్నెలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. సంగీత దర్శక ద్వయంగా పేరుగాంచిన శంకర్. గణేశ్ మహారాశి చిత్రం ద్వారా సంగీతదర్శకులుగా పరిచయం అయ్యారు. అలా పలు విజయవంతమైన చిత్రాలకు పని చేశారు. ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరిగా పేరుగాంచారు. కాగా వీరులో శంకర్ చాలా కాలం క్రితమే కన్నుమూశారు. అయినప్పటికీ గణేశ్ తన పేరును శంకర్‌గణేశ్‌గానే కొనసాగిస్తున్నారు. కాగా ఈయన శ్యాసకోస సమస్య కారణంగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆస్పత్రిలో చేరి అత్యవస చికిత్రా విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఇంతకు ముందే గుండెకు సంధించిన సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే నటుడు రోబో శంకర్ కూడా బుధవారం అస్వస్దత కారణంగా చైన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేసి చికిత్స పొందుతున్నారు. ఈయన తీవ్ర పని వత్తిడి కారణంగా రక్తపోటుకు గురైనట్లు తెలిసింది.