
సినిమాగా కనకవళ్లి నాటకం
తమిళసినిమా: బహుళ ప్రాచుర్యం పొందిన కనకవళ్లి అనే నాటకం ఇప్పుడు అదేపేరుతో సినిమాగా రూపొందింది. రువా ప్రొడక్షన్‌న్స్ పతాకంపై విఘ్నేశ్, వేలుమణి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను జయరావ్ చేవూరి నిర్వహించారు. ఈయన థియేటర్ ల్యాబ్‌లో నటుడు శ్రీకాంత్, అధర్వ, ఆది, మునీష్‌కాంత్, వినోద్‌సాగర్ వంటి వారు నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బహుళ ప్రాచుర్యం పొందిన కనకవళ్లి అనే నాటకాన్ని అదే పేరుతో సినిమాగా తెరకెక్కించినట్లు చెప్పారు. తిమ్మారెడ్డిపల్లి అనే సుసంపన్నమైన గ్రామంలోని ప్రజలు వరద కారణంగా బాధింపునకు గురవుతారన్నారు. దీంతో ఆ గ్రామంలోని ఒక సమాజ సేవకుడు వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాడన్నారు. అది గిట్టని ఆ గ్రామ మోతుబారులు ఐదుగురు ప్రతి ఇంటి వ్యవసాయ పొలాలను, నాశనం చేయడంతోపాటు, ఆ ఊరి యువతులను చెరపడతారన్నారు. ఇవేవీ తెలియని గ్రామ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి చెందిన సునీత అనే యువతి కనకవళ్లి అనే దేవతగా విశ్వరూపం దాల్చి ఆ దుర్మార్గులను ఎలా అంతం చేసి ప్రజలను కాపాడింది అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన పశుపతి, కలైరాణి కూత్తుపట్టరై నటనా స్కూల్‌లో శిక్షణ పొందిన వారని తెలిపారు. టైటిల్ పాత్రను పోషించిన స్వేచ్ చక్రవర్తి హైదరాబాద్‌కు చెందిన నటి అని చెప్పారు. ఈ భరతనాట్యం కళాకారిణి అని, సంగీతంలో ఫైట్స్‌లోనూ శిక్షణ పొందినట్లు చెప్పారు. 24 ఏళ్ల ఈ యువనటి కనకవళ్లి పాత్రకు జీవం పోశారన్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ చాయాగ్రహణంను అందించినట్లు చెప్పారు.
మృణాల్
ఠాగూర్